Sunday, December 29, 2024
HomeAP జిల్లా వార్తలుకర్నూలుSrisailam: తిరుమలలో మాకు ప్రాధాన్యత ఇవ్వండి : మంత్రి కొండా సురేఖ

Srisailam: తిరుమలలో మాకు ప్రాధాన్యత ఇవ్వండి : మంత్రి కొండా సురేఖ

మంత్రి సురేఖ ఆవేదన

తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులకు తిరుమల క్షేత్రంలో ప్రాధాన్యం ఇవ్వాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలను తిరుమలలో అనుమతించాలని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ ధర్మాశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

- Advertisement -

శుక్రవారం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనార్థం శ్రీశైల క్షేత్రానికి విచ్చేసిన ఆమెకు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. రెండు రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అనంత‌రం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారని, వారి కోరిక మేరకు తిరుమల దేవస్థానంలో భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలను తిరుమలలో అనుమతించాలని డిమాండ్ చేశారు. భక్తుల విన్నపాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త‌మ విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున తెలంగాణ రాష్ట్రంలో ధర్మ ప్రచారానికి నిధులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. గత గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను ఈ ప్రభుత్వం అనుసరించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News