బైపాస్ సర్జరీకి ముందు మన్మోహన్ ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. దీంతో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ ను ఎయిమ్స్ వైద్యులు ఎంతో శ్రమించి 10 నుంచి 11 గంటలపాటు చేశారు. ఆ రాత్రి బ్రీతింగ్ పైప్ తీసిన తరువాత మన్మోహన్ మాట్లాడిన తొలి మాటలు ఆయన ఎంత పెద్ద దేశభక్తుడో వివరిస్తాయి.
“దేశం ఎలా ఉంది? కాశ్మీర్ ఎలా ఉంది? అంతా సవ్యంగానే ఉంది కదా?” అంటూ తనకు ఆపరేషన్ చేసిన సీనియర్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండాను మన్మోహన్ ప్రశ్నించటంతో డాక్టరే ఆశ్చర్యపోయారు. “అదేంటి మీరు మీ ఆపరేషన్ ఎలా అయిందని అడగకుండా ఇలా అడుగుతున్నార”ని డాక్టర్ అడగ్గా, “నాకు మీ మీద పూర్తి విశ్వాసం ఉంది, నేను దేశం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నా” అంటూ నింపాదిగా సమాధానం ఇచ్చారు మన్మోహన్. దటీజ్ మన్మోహన్. 2009లో జరిగిన ఈ విషయం తాజాగా వైరల్ అవుతోంది.
Manmohan Singh after surgery: 10 గంటల సర్జరీ తరువాత మన్మోహన్ ఫస్ట్ ఏమన్నారంటే?
వైరల్ అవుతున్న..