Monday, December 30, 2024
HomeతెలంగాణKTR: కొడుకు పాటకు మురిసిపోయిన కేటీఆర్.. గర్వంగా ఉందని ట్వీట్

KTR: కొడుకు పాటకు మురిసిపోయిన కేటీఆర్.. గర్వంగా ఉందని ట్వీట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు ఆయన కుమారుడు హిమాన్షు రావు అదిరిపోయే గిప్ట్ ఇచ్చారు. ‘యానిమల్’ సినిమాలోని ‘నాన్న నువ్వు’ పాటను స్వయంగా పాడారు. ఈ విషయాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. జూలైలో తన పుట్టినరోజు కోసం నా కొడుకు దీన్ని రికార్డ్ చేశాడని.. కానీ అది సంతృప్తికరంగా రాలేదని భావించి విడుదల చేయలేదన్నారు.

- Advertisement -

అయితే తాను ఆ పాటను వారం క్రితం మొదటిసారి విన్నానని హిమాన్షు గానం అద్భుతంగా ఉందని, అతని గాత్రం నచ్చిందని ప్రశంసించారు. తండ్రిగా దీని పట్ల ఎంతో గర్వపడుతున్నానన్నారు. కష్టతరమైన సంవత్సరంలో తనకు ఉత్తమ బహుమతి అందించిన హిమాన్షుకు అభినందనలు అంటూ కేటీఆర్ వెల్లడించారు. కాగా ఉన్నత చదువుల కోసం హిమాన్షు అమెరికాలో ఉంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News