Sunday, December 29, 2024
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..?

Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..?

హీరో అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్‌పై ఎదురైన ప్రశ్నకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడి కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై మీ స్పందన ఏమిటని జర్నలిస్టులు ప్రశ్నించారు. ఇది సంబంధం లేని ప్రశ్న అని పవన్ సమాధానం దాటవేశారు.

- Advertisement -

అంటే మీ ఫ్యామిలీ మెంబర్ కదా అని మళ్ళీ ప్రశ్నించగా ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే మీరు సినిమాల గురించి మాట్లాటం ఏమిటని ఎదురు ప్రశ్నించారు. ఇంతకన్నా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించాలని..మీరు ఈ చర్చను సినిమా వైపు మళ్లించకుండా వైసీసీ అరాచకం, దాడులపై పెట్టండని సూచించారు. జర్నలిస్టులు కూడా పెద్ద మనసుతో ఆలోచించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. కాగా అల్లు అర్జున్ అరెస్టు అనంతరం ఇప్పటిదాక ఆయనను పవన్ కల్యాణ్ పరామర్శించలేదు. చిరంజీవి, నాగబాబు, ఇతర మెగా కుటుంబ సభ్యులు అల్లు అర్జున్‌ను పరామర్శించినప్పటికి పవన్ మాత్రం పరామర్శించలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News