Monday, December 30, 2024
HomeTS జిల్లా వార్తలుమెదక్Cheryala: కొమరెల్లి మల్లికార్జునుడి కల్యాణం కోసం భారీ భద్రత

Cheryala: కొమరెల్లి మల్లికార్జునుడి కల్యాణం కోసం భారీ భద్రత

మల్లన్న కల్యాణానికి..

శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు బందోబస్తు పరిశీలించారు. ఆదివారం హుస్నాబాద్ ఏసీపి సతీష్, సిద్దిపేట ఏసీపీ మధు, గజ్వేల్ ఎసిపి పురుషోత్తం రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, చేర్యాల సిఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజు, కలసి దేవుడి కళ్యాణం జరుగు తోటబావి, పరిసర ప్రాంతాలు వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్ దర్శన ప్రదేశాలు పరిశీలించారు. మూడు నెలల పాటు ప్రతి ఆదివారం ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

- Advertisement -

భక్తులతో మర్యాదగా ప్రవర్తించండి

ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, హుస్నాబాద్ ఎసిపి సతీష్ శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం మహోత్సవం బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులకు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. దర్శనానికి వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని, పోలీసుల వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. దేవుని కళ్యాణంలో విధులు నిర్వహించడం అదృష్టంగా భావించాలన్నారు.

4 సెక్టార్లుగా బందోబస్తు

1 కళ్యాణ మహోత్సవం వేదిక తోటబావి వద్ద, 2 టెంపుల్ ఆవరణ గర్భగుడి దర్శనం, 3 ట్రాఫిక్
4 పార్కింగ్ ప్రదేశాలుగా గుర్తించి బందోబస్తు నిర్వహించనున్నారు. తాత్కాలిక పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నారు. విఐపి దర్శనం, శీఘ్ర దర్శనం, సాధారణ దర్శనం అనే మూడు విభాగాలుగా భక్తులను విభజించారు. పకడ్బందీ నిఘా కోసం 75 సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అడిషనల్ డీసీపీలు ఇద్దరు, ఎసిపిలు ఆరుగురు, సిఐలు 25 మంది, ఎస్ఐలు 26 మంది, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, మహిళా హోంగార్డులు, బీడీ టీమ్స్, యాక్సెస్ కంట్రోల్, రోప్ పార్టీ సిబ్బంది కలిపి మొత్తం 361 మంది బందోబస్తు చర్యల్లో పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు,టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్,గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, చేర్యాల సిఐ శ్రీను,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్, హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, మరియు సీఐలు,ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు,ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News