Tuesday, December 31, 2024
Homeట్రేడింగ్RASEFT: హైదరాబాద్ లో రసెఫ్ట్ సదస్సు

RASEFT: హైదరాబాద్ లో రసెఫ్ట్ సదస్సు

హైదాదరాబాద్ లో..

రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ సస్టైనబిలిటీ ఇంజినీరింగ్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ (RASEFT 2024) IEEE అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్‌లోని మాతురి వెంకట సుబ్బారావు (MVSR) ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, ఆవిష్కర్తలు ఈ సదస్సులో పాల్గొని సస్టైనబిలిటీ సవాళ్లను పరిష్కరించేందుకు టెక్నాలజీ పాత్రపై చర్చించారు. ఇందులో భాగంగా సైదాబాద్ లోని మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజ్ లో సైదాబాద్‌లో ప్రీ-కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌లు విజయవంతంగా నిర్వహించారు.

- Advertisement -

ముఖ్య అతిథిగా డా. జి.ఏ. శ్రీనివాసరావు (డైరెక్టర్, DRDL), ప్రత్యేక అతిథిగా సురేంద్ర తిప్పరాజు (డేటా & AI ఆర్కిటెక్చర్ గ్రూప్ లీడర్, మైక్రోసాఫ్ట్ ఇండియా) పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ స్పాన్సర్‌గా, IEEE హైదరాబాద్ సెక్షన్ టెక్నికల్ కో-స్పాన్సర్‌గా వ్యవహరించింది.

ఆర్గనైజింగ్ కమిటీ సారథ్యంలో, నారాయణా MGPL (జనరల్ ఛైర్), డా. లక్ష్మీ నారాయణ సదాశివులు (ఆర్గనైజింగ్ ఛైర్), డా. వై. విజయలత (చైర్, IEEE హైదరాబాద్ సెక్షన్) నాయకత్వంలో, రసెఫ్ట్ 2024 కీ నోట్ ప్రసంగాలు, టెక్నికల్ పేపర్ ప్రెజెంటేషన్లు, పునర్వినియోగ శక్తి, ఆధునిక కమ్యూనికేషన్లు, డిజిటలైజేషన్ వంటి అంశాలపై ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News