Tuesday, December 31, 2024
Homeట్రేడింగ్Hyderabad: సర్ సి.వి రామన్ ఒలింపియాడ్ టాలెంట్ ప‌రీక్ష

Hyderabad: సర్ సి.వి రామన్ ఒలింపియాడ్ టాలెంట్ ప‌రీక్ష

ఏటా నిర్వహించే ఎగ్జామ్

సుచిరిండియా ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన స‌ర్ సివి రామ‌న్ ఒలింపియాడ్ పేరుతో ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థుల‌కు ప‌రీక్ష నిర్వ‌హించింది. భార‌త్ లోని దాదాపు 560 కేంద్రాల నుంచి 75 వేల మంది విద్యార్థులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

- Advertisement -

యంగ్ జీనియస్ అవార్డులు

ఈ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థుల‌కు యంగ్ జీనియ‌స్ అవార్డులు ఫిబ్ర‌వ‌రి 16న నాంప‌ల్లిలోని ల‌లిత క‌ళా తోర‌ణంలో అందించ‌నున్న‌ట్లు సుచిరిండియా సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు ల‌య‌న్ డాక్ట‌ర్ వై. కిర‌ణ్ తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని, సృజ‌నాత్మ‌క‌త‌ను వెలికి తీసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు వారిని సిద్ధం చేసి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సుచిరిండియా ఫౌండేషన్ సర్ సి.వి రామన్ ఒలింపియాడ్ పరీక్షలను గత 30 ఏళ్లుగా ప్రతి ఏటా నిర్వహిస్తోంద‌న్నారు.

దేశవ్యాప్తంగా 560 కేంద్రాల్లో

శనివారం రోజున సర్ సి.వి రామన్ ఒలింపియాడ్ పరీక్షను దేశవ్యాప్తంగా 560 కేంద్రాల్లో నిర్వహించింది. ఈ పరీక్షకు 75 వేలమందికి పైగా విద్యార్థులు హాజరై, తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి గోల్డ్ మెడల్స్, మొమెంటోలు, నగదు పురస్కారాలు, సర్టిఫికేట్లు అందిస్తామ‌న్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News