Sunday, January 5, 2025
Homeపాలిటిక్స్Kavitha: నేడు ఇందూరుకు కవిత

Kavitha: నేడు ఇందూరుకు కవిత

బెయిల్ తరువాత ఫస్ట్ టైం

జైలుకు వెళ్లి, విడుదలైన అనంతరం తొలిసారి ఇందూరుకు వస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు, జాగృతి నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ కవితకు తొలుత ఇందల్వాయి టోల్ గేట్ వద్ద , అనంతరం డిచ్‌పల్లి వద్ద ఘనంగా స్వాగతం పలకనున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత నేరుగా నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్‌ తెలంగాణ తల్లి విగ్రహం వరకు చేరుకుంటారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

- Advertisement -

నేటి కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలుకుతూ ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లలో పెద్దపెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News