Saturday, January 4, 2025
Homeఓపన్ పేజ్Revanth Reddy: రేసుగుర్రం రేవంత్‌

Revanth Reddy: రేసుగుర్రం రేవంత్‌

బాబు, రేవంత్ ల..

సాధా­ర­ణంగా ప్రాంతీయ పార్టీల్లో ముఖ్య­మం­త్రులు చాలా శక్తి­మం­తు­లుగా ఉంటారు. జాతీయ పార్టీల ముఖ్య­మం­త్రులు అంతగా సొంత నిర్ణ­యాలు తీసు­కో­లేరు. కానీ, తెలం­గాణ ముఖ్య­మంత్రి రేవంత్‌ రెడ్డి దూకుడు మాత్రం వేరే లెవె­ల్‌లో ఉంటోంది. సంధ్య థియే­టర్‌ ఉదం­తంలో ఒక మహిళ మర­ణిం­చిన నేప­థ్యంలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ అరెస్టు లాంటి పరి­ణా­మాలు రేవంత్‌ ఆదే­శాలు లేకుండా జరి­గేవి కావు. అయితే, ఇలాంటి విష­యాల్లో టాలీ­వు­డ్‌ను తన గుప్పె­ట్లోకి తెచ్చు­కో­వా­లని రేవం­త్‌కు చెప్పిం­దె­వరు? ఆయన వెన­కుండి ఇదంతా నడి­పి­స్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? ఒక జాతీయ పార్టీ, అందునా తరచు ముఖ్య­మం­త్రు­లను మారు­స్తా­రన్న అప­ప్రథ ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం.. ఇంత సర్వ­స్వ­తం­త్రంగా వ్యవ­హ­రి­స్తు­న్నా­రంటే ఆయ­నకు పైనుంచి ఎవరి అండ­దం­డలు ఉన్నాయి? ఇంకె­వరో కాదు.. స్వయానా పార్టీ అగ్ర­నేత రాహుల్‌ గాంధీ అని కాంగ్రెస్ వర్గాల నుంచి విని­పి­స్తోంది. గతంలో కూడా హైడ్రా కూల్చి­వే­తల సమ­యంలో కాకి­నాడ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లం­రా­జుకు చెందిన ఒక భవ­నాన్ని కూల్చే­శారు. దానిపై ఆయన పంచా­యితీ పెట్టి రాహుల్‌ గాంధీ వరకు తీసు­కె­ళ్లారు. అప్పుడు రేవంత్‌ రెడ్డి చాలా స్పష్టంగా.. పళ్లం­రాజు గతంలో బీఆ­ర్‌­ఎస్ నేత­లతో కలిసి ఏవేం వ్యాపా­రాలు, వ్యవ­హా­రాలు చేస్తు­న్నారో కుండ బద్ద­లు­కొట్టి మరీ చెప్ప­డంతో రాహుల్‌ గాంధీ తన ఓటును రేవం­త్‌కే వేశారు. ఇక­ముందు ఇలాం­టివి తన వద్దకు తేవొ­ద్దని చెప్పారు. నిజా­నికి అప్పుడే కాదు.. తెలం­గాణ అసెంబ్లీ ఎన్ని­క­లకు ముందు నుంచే రేవంత్‌ రెడ్డికి రాహుల్‌ గాంధీ ఆశీ­స్సులు మెండుగా ఉన్నట్లు తెలు­స్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధి­కా­రం­లోకి తీసు­కొచ్చే బాధ్యత తన­దని, సీని­యర్ల నుంచి మాత్రం ఇబ్బం­దులు లేకుండా చూడా­లని అప్పట్లో రాహుల్‌ గాంధీని రేవంత్‌ కోరా­రని.. అప్ప­ట్నుంచే ఆయ­నకు రాహుల్‌ అండ­దం­డలు గట్టిగా అందడం మొద­లైం­దని కాంగ్రెస్ పార్టీ­లోని అత్యు­న్నత వర్గాలు స్వయంగా జాతీయ స్థాయి జర్నలిస్టుల వద్ద ప్రస్తావిస్తున్న విషయం గమనార్హం. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీని­య­ర్లలో కొంత­మంది గాంధీ కుటుం­బా­నికి వీర­వి­ధే­యు­లుగా ముద్ర­ప­డినా కూడా.. వాళ్ల వల్ల పార్టీకి కలిగే ప్రయో­జనం ఎంతనే విష­యాన్ని రాహుల్‌ బేరీజు వేసు­కు­న్నా­రని, అప్ప­టి­నుంచి క్రమంగా తన­కంటూ రాష్ట్రాల్లో కొంత­మంది నాయ­కులు విశ్వా­స­పా­త్రులు ఉండా­లన్న లెక్కతో రేవంత్‌ రెడ్డిని ప్రోత్స­హిం­చడం మొద­లు­పె­ట్టా­రని ఆ వర్గాలు అన్నాయి.
ఇక సంధ్య థియే­టర్‌ వ్యవ­హా­రా­నికి వస్తే.. రేవంత్‌ రెడ్డి అంత తీవ్రంగా స్పందిం­చ­డా­నికి, ముఖ్యంగా అసెం­బ్లీలో సైతం దీని గురించి స్వయంగా ఆయనే మాట్లా­డ­డంతో పాటు ఇతర మంత్రులు సైతం ఆ విషయం మీద కాస్త గట్టి­గానే స్పందిం­చ­డా­నికి చాలా కార­ణాలే ఉన్నాయి. కేవలం ఆ ఒక్క సంఘ­టన మాత్రమే కాదు, గత కొంత­కా­లంగా రాష్ట్రంలో జరు­గు­తున్న పరి­ణా­మాలు కూడా ఆయన దృష్టిలో పెట్టు­కు­న్నారు. గతంలో ఖమ్మం జిల్లాలో భారీ స్థాయిలో వర­దలు వచ్చి­న­ప్పుడు గానీ, ఇత­రత్రా విప­త్తుల సమ­యంలో గానీ టాలీ­వుడ్‌ పెద్దగా స్పందిం­చ­లేదు. ప్రభుత్వం ఇచ్చే రాయి­తీలు తీసు­కుంటూ.. ప్రభుత్వ ప్రోత్సా­హ­కాలు పొందుతూ.. సిని­మాలు తీసి, వాటితో లాభాలు పొందు­తున్న చాలా­మంది పెద్ద­మ­ను­షులు ఇప్ప­టికీ బీఆ­ర్‌­ఎస్ వైపే కాస్త మొగ్గు చూపు­తు­న్న­ట్లుగా సమా­చారం. దాని­కి­తోడు పుష్ప సినిమా ఫంక్ష­న్‌లో హీరో అల్లు అర్జున్‌ ముఖ్య­మంత్రి పేరు మర్చి­పో­వడం, ఆ విషయం వీడియో రూపంలో విప­రీ­తంగా వైరల్‌ అవు­తున్న.. దానికి, అల్లు అర్జున్‌ మీద కేసు నమో­దు­కా­వడం, ఆయన అరెస్టు కావడం లాంటి పరి­ణా­మా­లకు సంబంధం లేదని పరి­శ్రమ నుంచి ఏ ఒక్కరూ ఖండిం­చ­లేదు. అలా ఖండిం­చ­క­పో­వడం రేవం­త్‌­రె­డ్డిని తీవ్ర ఆగ్ర­హా­నికి గురి­చే­సింది. అలాంటి చిన్న చిన్న విష­యా­లను పట్టిం­చు­కునే స్థాయి నుంచి ఎప్పుడో పైకి ఎది­గిన నాయ­కు­డా­యన. అయినా కూడా దాన్ని చిల­వలు పలువ­లుగా ప్రచారం చేస్తుంటే.. అసలు సినీ ప్రపంచం నుంచి ఒక్కరు కూడా దాన్ని ఖండిం­చిన పాపాన పోలేదు.
చివ­రకు బెని­ఫిట్‌ షోలు, టికెట్‌ ఛార్జీల పెంపు లాంటివి ఉండ­బో­వని గట్టిగా అసెం­బ్లీలో చెప్పిన తర్వాత అప్పుడు సినీ ప్రము­ఖు­లంతా కట్ట­గ­ట్టు­కుని మరీ రేవంత్‌ రెడ్డి వద్దకు వెళ్లారు. అందు­లోనూ స్వయంగా కింగ్‌ నాగా­ర్జున ముఖ్య­మం­త్రికి శాలువా కప్పి సత్క­రిం­చారు. దగ్గు­బాటి సురే­ష్‌­బాబు, దిల్‌ రాజు, సునీల్‌ నారంగ్‌, అల్లు అర­వింద్‌ సహా పెద్ద పెద్ద నిర్మా­తలు, దర్శ­కులు, ఇంకా ఎంతో­మంది నటులు కూడా ఈ సమా­వే­శా­నికి హాజ­ర­య్యారు. ఈ సమావేశానికి ప్రభుత్వం వైపు నుంచి కానీ టాలీవుడ్‌ ప్రముఖుల వైపు నుంచి కానీ ఎటువంటి ఎజెండా లేకపోవటం ఒక విశేషం. సమావేశం మొదలైన కొన్ని క్షణాల్లోనే రేవంత్‌ సూటిగా ఇండస్ట్రీకి మా ప్రభుత్వం ఎంతో చేసింది. గతంలోనూ ఇండస్ట్రీకి మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. తాజాగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టికెట్‌ ధరలు పెంచుకోవటానికి 8 జీవోలు ఇచ్చాం. ఈ జీవోల న్నీ లంచం తీసుకుని టికెట్‌ ధరలు పెంచారని వచ్చిన తప్పు డు వార్తల ప్రచారం ఇండస్ట్రీ ప్రముఖులతో సీఎం మాట్లాడి నట్టు తమ్మారెడ్డి భరద్వాజ మీడి యాకు వివరించారు. ఇలాంటి ప్రశ్నలు ఆ ప్రముఖులను ఆ నాలుగు గోడల మధ్య సీఎం రేవంత్‌ సూటిగా అడిగినట్టు సమాచారం. అందులో రేవంత్‌ రెడ్డి మాత్రం తన అభి­ప్రా­యా­లను కుండ బద్ద­లు­కొ­ట్టి­నట్లు వాళ్లకు చెప్పే­శారు. పరి­శ్ర­మకు తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుం­దని, అయితే అదే సమ­యంలో అటు నుంచి కూడా ప్రతి­స్పం­దన ఉండా­లని చెప్పారు. ఈ సమా­వే­శంలో తాము వందల కోట్లు పెట్టి సిని­మాలు తీస్తు­న్నా­మని, అలాం­ట­ప్పుడు పబ్లి­సిటీ లేక­పోతే ప్రజలు సిని­మాకు అంతగా రారని మురళీ మోహన్‌ లాంటి పెద్ద మనిషి అనడం మాత్రం అంత సబ­బుగా అని­పిం­చడం లేదు. పెద్ద సినిమా అని అను­కు­న్న­ప్పు­డల్లా ఇలా పెద్ద పెద్ద ఈవెంట్లు పెడ­తా­మని చెప్పడం దేనికి సూచనో ఆయనో ఆలో­చిం­చు­కో­వాలి. నిజా­నికి దేవర సినిమా ప్రమో­షన్‌ కోసం తల­పె­ట్టిన పెద్ద కార్య­క్ర­మా­నికి అను­కున్న దాని­కంటే చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తు­న్నా­రని తెలిసి ఏకంగా ఆ కార్య­క్ర­మాన్నే జూని­యర్‌ ఎన్టీ­ఆర్‌ రద్దు చేసు­కు­న్నారు. అంత­మంది వస్తే అదుపు చేయడం కష్ట­మని, ఏవైనా అను­కోని ఘట­నలు జరి­గితే అందరూ బాధ­ప­డ­తా­రని ఆయన ఆ పని­చే­శారు. సినిమా కలె­క్షన్లు రావడం ముఖ్యమా.. ప్రజల ప్రాణాలు కాపా­డడం ముఖ్యమా అన్న ప్రశ్న వస్తే దేనికి ఓటే­స్తారో ముర­ళీ­మో­హన్‌ లాంటి పెద్ద­మ­ను­షులు తామే నిర్ణ­యిం­చు­కో­వాలి. అసలు సిని­మాలు అంటేనే వక్రీ­క­రణ చాలా తీవ్రంగా జరు­గు­తోంది. ఒక­ప్పటి దాన వీర శూర కర్ణతో మొద­లు­పె­డితే, తాజాగా ఆర్‌­ఆ­ర్‌­ఆర్‌ సినిమా వరకు అన్నిం­టి­లోనూ పురా­ణా­లను, చరి­త్రను విప­రీ­తంగా వక్రీ­క­రి­స్తు­న్నారు. అసలు వ్యాసుడు రాసిన మహా­భా­ర­తా­నికి, దాన వీర శూర కర్ణలో కర్ణుడి పాత్రకు ఎక్కడా పోలిక లేద­న్నది సుస్పష్టం. ఈ విషయం పురాణ పండి­తు­లను అడి­గితే తెలు­స్తుంది. అలాగే కల్కి సిని­మా­లోనూ ఇష్టం వచ్చి­నట్లు పురా­ణా­లను వక్రీ­క­రించి తమకు చేతికి వచ్చి­నట్లు భాష్యం రాసే­సు­కు­న్నారు. ఇక ఆర్‌­ఆ­ర్‌­ఆర్‌ సినిమా చూస్తే, ఒక మాది­రిగా చరిత్ర తెలి­సి­న­వారు ఎవ­రైనా కూడా.. అల్లూరి సీతా­రా­మ­రాజు బ్రిటిష్‌ పోలీసు విభా­గంలో పని­చే­శా­రంటే నమ్ము­తారా? అలాగే తెలం­గాణ స్వాతం­త్య్ర­పో­రాట యోధుడు కొమురం భీమ్‌, అల్లూరి సీతా­రా­మ­రాజు ఒక కాలం­లోని వాళ్లేనా? వాళ్లి­ద్దరూ అసలు కలిసే అవ­కాశం అన్నది ఉంటుందా? ఇలాంటి చరిత్ర వక్రీ­క­ర­ణ­లతో వందల కోట్లు పెట్టి సిని­మాలు తీయడం, మళ్లీ వాటికి కలె­క్షన్లు కావా­లని మొదటి వారం­లోనే విప­రీ­తంగా టికెట్‌ ధరలు పెంచే­సు­కో­వడం, దాని­కోసం ప్రభు­త్వా­లను ఆశ్ర­యిం­చడం ఇప్పుడు మామూ­లై­పో­యింది. ఇలా ధరలు పెంచడం వల్ల మొదటి రెండు మూడు వారాల పాటు సామా­న్యులు అన్న­వాళ్లు థియే­టర్ల వైపు వెళ్ల­డా­నికే భయ­ప­డా­ల్సిన పరి­స్థి­తిని తెలుగు సినిమా పరి­శ్రమ తీసు­కొ­చ్చింది. పుష్ప2 సిని­మానే తీసు­కుంటే.. ఒక కుంటుం­బంలో నలు­గురు కలిసి మొదటి 15 రోజుల్లో సిని­మాకు వెళ్లా­లంటే దాదాపు రూ.5వేలు ఖర్చు­పె­ట్టాల్సి వచ్చింది. అంత పెట్టి సినిమా చూసే పరి­స్థితి ఎంత­మం­దికి ఉంటుంది? అంతే­కాదు, ఈ పుష్ప2 సిని­మాలో హీరో మూత్ర­వి­స­ర్జన చేసిన చెరు­వులో నీటిని ఒక ఐపీ­ఎస్ అధి­కారి తాగి­నట్లు చూపి­స్తారు. అసలు ఐపీ­ఎస్ వ్యవ­స్థను ఇంతలా దిగ­జా ­ర్చా­లని ఆ దర్శ­కు­డికి, రచ­యి­తకు, నటు­లకు ఎలా అని­పిం­చింది. ఇదే సిని­మాను మళ­యా­ళంలో కూడా డబ్బింగ్‌ చేసి విడు­దల చేశారు. అక్కడ రూ.25 కోట్లు పెట్టి సినిమా కొంటే, దానికి రూ.5 కోట్లు కూడా రాలేదు. దాంతో చివ­రకు మళ్లీ ఆ దృశ్యాన్ని రీషూట్‌ చేసి అప్పుడు మళ్లీ అక్కడ విడు­దల చేయాల్సి వచ్చింది. ఇలా ప్రజల మనో­భా­వా­లను ఏమాత్రం పట్టిం­చు­కో­కుండా, ప్రజ­లకు ఎలాంటి సందేశం ఇస్తు­న్నామో కూడా చూడ­కుండా ఎడా­పెడా సిని­మాలు తీసి­పా­రే­స్తు­న్నారు.
చిరం­జీవి ఎందుకు వెళ్ల­లేదు?
తెలం­గాణ ముఖ్య­మంత్రి రేవంత్‌ రెడ్డి, ఇతర మంత్రు­లతో కలిసి టాలీ­వుడ్‌ సినీ పరి­శ్రమకు చెందిన కొందరు పెద్దలతో జరిగిన సమా­వే­శా­నికి అగ్ర­న­టుడు చిరం­జీవి వెళ్ల­లేదు. దీని­వె­నుక ఆంతర్యం ఏంటని చాలా­మంది చర్చిం­చు­కుం­టు­న్నారు. ఒక­రి­ద్దరు నాతో కూడా ఈ విషయం ప్రత్యే­కంగా ప్రస్తా­విం­చారు. ఎందు­కంటే, గతంలో ఆంధ్ర­ప్ర­దే­శ్‌లో వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య­మం­త్రిగా ఉన్న­ప్పుడు ఆయన వద్దకు తెలుగు చిత్ర పరి­శ్రమ ప్రము­ఖులు ఇలాగే వెళ్లారు. అప్పుడు చిరం­జీవి కూడా ఆ బృందంలో ఉన్నారు. అప్పుడు వెళ్ల­డా­నికి ఎలాంటి ఇబ్బందీ లేని చిరం­జీ­వి.. ఇప్పుడు ఎందుకు రాలేదు? ముఖ్య­మంత్రి వద్దకు ఎందుకు వెళ్ల­లేదు? ఈ ప్రశ్నకు చాలా సమా­ధా­నాలే వస్తు­న్నాయి. తన తమ్ముడు పవన్‌ కళ్యా­ణ్‌తో ఈ మధ్య­కా­లంలో చిరం­జీవి బాగా సన్ని­హి­తం­గానే ఉంటు ­న్నారు. ఇప్ప­టికీ ఆయన కాంగ్రెస్ నాయ­కుడే అని అందరూ అను­కుం­టున్నా, ఆ పార్టీ కంటే జన­సే­న­తోనే ఆయన రాసు­కు­పూ­సుకు తిరు­గు­తు­న్నట్లు కని­పి­స్తోంది. పెద్ద తమ్ముడు నాగ­బా­బుకు కూడా క్యాబి­నెట్‌ పదవి వస్తు­న్నం­దున ఈ బంధం మరింత బలో­పేతం అవు­తోంది. పవన్‌ కళ్యాణ్‌ బీజే­పీకి బాగా దగ్గ­రగా ఉంటు­న్నారు. అందు­వల్ల చిరం­జీ­వికి కూడా బీజేపీ మనో­భా­వా­లను, తద్వారా తన తమ్ముడి మనో­భా­వా­లను దెబ్బ­తీ­య­కూ­డ­దన్న ఉద్దేశం ఉందో ఏమో.. అందు­కనే ఆయన కాంగ్రెస్ ముఖ్య­మంత్రి అయిన రేవంత్‌ రెడ్డి వద్ద సమా­వే­శా­నికి వెళ్ల­లే­దేమో అని అంతా అను­కుం­టు­న్నారు. ఫిల్మ్‍నగర్‌ టాక్‌ ప్రకారం తెలుగు పరిశ్ర మకు పెద్ద దిక్కు అవసరం ఉంది. గతంలో దాసరి నారాయణ రావు ఈ బాధ్యతను సమర్థవం తంగా నిర్వహి ంచారు. ఆయన స్థానంలో చిరంజీవి ఉంటారని అంతా ఆశిస్తున్నట్టుగా ఉంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం కొంత భిన్నంగానే కనిపిస్తు న్నది. తెలంగాణ సర్కారుకి టాలివుడ్‌కు మధ్య గ్యాప్‌ సమస్య తాత్కాలి కంగా సమసిపోయిందా ..? లేదా ..? అనేది సమీప భవిష్యత్‌లో చిరంజీవి మౌనం వీడటంపైనే ఉందనే వాదన ఒక వైపు ఉంది. ఇదంతా ఒక ఎతైతే ఇప్పటి వరకూ సీఎం రేవంత్‌ మాత్రం రేసుగుర్రంలా దూసుకునిపోతూ ఎక్కడిక్కడ చెక్‌ పెడుతున్నారు.

- Advertisement -

బాబుకు కోపం వచ్చింది

ఇక ఆంధ్ర­ప్ర­దేశ్‌ విష­యా­నికి వస్తే.. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవు­తోంది. ముఖ్య­మంత్రి చంద్ర­బాబు స్వయంగా ఇటీ­వల నిర్వ­హిం­చిన కేబి­నెట్‌ సమా­వే­శంలో కొంత­మంది మంత్రుల వ్యవ­హారం మీద అసం­తృప్తి వ్యక్తం చేశారు. అవ­స­ర­మైతే కొంద­రిని తప్పిం­చ­డా­నికి కూడా తాను వెన­కా­డ­బో­నని స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా నాగ­బా­బును కేబి­నె­ట్‌­లోకి తీసు­కుం­టా­మని ముఖ్య­మంత్రే వెల్ల­డిం­చిన నేప­థ్యంలో కొన్ని మార్పులు, చేర్పులు కూడా ఉంటా­యని తెలు­స్తోంది. తెలు­గు­దేశం పార్టీలో అత్యంత క్రియా­శీ­ల­కంగా ఉండే కొంత­మంది పెద్ద­లతో నేను మాట్లా­డి­న­ప్పుడు ప్రధా­నంగా కొన్ని వికెట్లు రాలి­పో­వడం ఖాయ­మన్న మాట వాళ్ల నుంచి విని­పిం­చింది. అది మరీ అంత ఆశ్చ­ర్య­కరం ఏమీ కాదు. కొంత­మంది మంత్రుల పని­తీరు అత్యంత నాసి­ర­కంగా ఉంటోం­దని, అందుకు సంబం­ధిం­చిన విష­యా­ల­న్నిం­టినీ తాను స్వయంగా మాని­టర్‌ చేస్తు­న్నా­నని చంద్ర­బాబు అంద­రికీ ఓపె­న్‌­గానే చెప్పే­శారు. ఆయన మన­సులో మాటను గ్రహిం­చడం అంత సులభం కాక­పో­యినా.. తరచు కొంత­మంది విష­యంలో విని­పి­స్తున్న విష­యా­లను చూస్తుంటే కొన్ని పేర్లు ప్రస్తా­విం­చక తప్పడం లేదు. వీళ్లం­ద­రినీ తప్పి­స్తా­ర­న్నది ఖాయం కాక­పో­యినా.. వీళ్లలో కొంత­మంది మాత్రం ఉత్త ఎమ్మె­ల్యే­లుగా మిగి­లి­పోక తప్పని పరి­స్థితి కని­పి­స్తోంది. వేటు పడే మంత్రుల జాబి­తాలో రాంప్ర­సాద్‌ రెడ్డి, వాసం­శెట్టి సుభాష్‌, కొండ­పల్లి శ్రీని­వాస్, కొలుసు పార్ధ­సా­రథి లాంటి పేర్లు విని­పి­స్తు­న్నాయి.
అంద­రి­కంటే ముందుగా మాట్లా­డు­కో­వా­ల్సింది రవా­ణా­శాఖా మంత్రి రాంప్ర­సాద్‌ రెడ్డి గురించే. అత్యంత తక్కువ కాలం­లోనే అత్యంత ఎక్కు­వగా అప్ర­దిష్ఠ మూట­గ­ట్టు­కున్న మొట్ట­మొ­దటి మంత్రి ఈయనే అని అందరూ ముక్త­కం­ఠంతో చెబు­తు­న్నారు. ఈయన పేషీలో జరు­గు­తున్న వ్యవ­హా­రా­లపై ఇప్ప­టికే ఇంటె­లి­జెన్స్​‍ విభాగం కన్నే­సింది. మహి­ళ­లకు ఉచిత బస్సు ప్రయాణం త్వర­లోనే ఉంటుం­దని ఈయన చేసి­నన్ని ప్రక­ట­నలు ముఖ్య­మంత్రి కూడా చేయ­లేదు. ఆరు గ్యారం­టీల్లో ఒక­టైన ఈ పథకం గురించి ఆయన అంత ఎక్కు­వగా మాట్లా­డడం వల్ల పథకం ఇప్పట్లో అమ­లు­కా­దన్న విషయం గురిం­చిన చర్చే ఎక్కు­వగా సాగింది, దాంతో వైసీపీ కూడా దీని­మీద విమ­ర్శిం­చ­డా­నికి అవ­కాశం ఏర్ప­డింది. ఆయన్ను తప్పిస్తే ఎవ­రిని పెడ­తా­రన్న చర్చలు వచ్చి­న­ప్పుడు అదే వర్గం నుంచి చాలా పేర్లే విని­పి­స్తు­న్నాయి. సీని­యర్‌ నాయ­కుడు.. కేవలం రెండో­సారి ఎమ్మె­ల్యేగా గెలి­చిన సోమి­రెడ్డి చంద్ర­మో­హన రెడ్డి పేరు వచ్చినా అదే జిల్లా నుంచి ఆనం ఉన్నం­దున ఆయ­నకు చాన్సు తక్కువ. దాంతో కడప జిల్లా నాయ­కు­రాలు, కాస్త వాగ్ధాటి ఉన్న మాధ­వి­రెడ్డి పేరు పరి­శీ­లిం­చొచ్చు.
విదే­శాల్లో ఉండి వచ్చి­నం­దున కాస్త తెలి­వి­తే­టలు ఉంటా­యని, ఎన్నారై వ్యవ­హా­రాలు కూడా చక్క­బె­డ­తా­రని కొండ­పల్లి శ్రీని­వా­స్కు మంత్రి పదవి ఇస్తే.. ఆయన చేసిన పనికి టీడీపీ అధి­ష్ఠానం ముక్కున వేలే­సు­కుంది. విశా­ఖ­పట్నం విమా­నా­శ్ర­యంలో కొండ­పల్లి శ్రీని­వాస్ బొత్స సత్య­నా­రా­యణ కాళ్లకు మొక్కి ఆశీ­ర్వాదం తీసు­కు­న్నారు. బొత్సను ఓడిం­చిన కిమిడి కళా­వెం­క­ట­రావు సీని­యర్‌ నాయ­కు­డైనా.. ఆయన్ను కాదని మరీ కొండ­ప­ల్లికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఇలాంటి పని చేస్తారా అని అంతా తల­ప­ట్టు­కు­న్నారు. అయితే, ఇంత మాత్రా­నికే మంత్రి పదవి పోతు ందా అంటే, ఏమో చెప్పలేం మరి.
సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్ర­హా­వి­ష్క­రణ సభకు వైఎ­స్సా­ర్సీ­పీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్‌ రావడం ఒక ఎత్త­యితే.. ఆయన ఏకంగా వేది­క­మీ­దకే వచ్చి మంత్రి పార్థ­సా­రథి, ఇతర నాయ­కుల సర­సన కూర్చో­వడం పార్టీని చాలా ఇరు­కున పెట్టింది. ఈ మొత్తం వ్యవ­హా­రంలో మంత్రి కొలుసు పార్థ­సా­రథి బాగా దెబ్బ­తి­న్నారు. సారథి వైసీపీ నుంచి వచ్చి ఇక్కడ పోటీ­చేసి గెలిచి మంత్రి కావ­డంతో.. తన మాజీ మిత్రుడు అని జోగి రమే­ష్‌కు అవ­కాశం ఇచ్చి ఉంటా­రన్న ప్రచారం గట్టి­గానే జరి­గింది. ఈ వ్యవ­హా­రంపై చంద్ర­బాబు, లోకేష్‌ కూడా కాస్త సీరి­య­స్­గానే స్పందిం­చారు. దీన్ని బట్టి ఈసారి పార్థ­సా­రథి వికెట్‌ పడడం ఖాయ­మని విని­పి­స్తోంది.
మరో­వైపు చూసు­కుంటే వైసీపీ నుంచి టీడీపీ, జన­సేన, లేక­పోతే బీజేపీ ఇలా ఏదో ఒక పార్టీ­లోకి వల­సలు వర­దలా వెల్లు­వె­త్తు­తు­న్నాయి. ఏ నాయ­కుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరు­తాడో తెలి­య­ట్లేదు. ఒక­వేళ టీడీ­పీలో చేర­డా­నికి పార్టీ అధి­ష్ఠానం నుంచి అను­మతి రాక­పోతే.. వెంటనే అయితే జన­సేన, లేక­పోతే బీజే­పీ­లోకి చేరి­పో­తు­న్నారు. కూటమి పార్టీ­లలో సమ­న్వ­య­లో­పాన్ని ఇది చూపి­స్తోంది. ఒకళ్లు వద్ద­ను­కున్న తర్వాత మరొ­కరు తీసు­కుంటే.. ఇక కూటమి ధర్మం ఎక్కడ ఉన్నట్లు? అంతే­కాదు.. వైసీపీ నాయ­కుల్లో చాలా­మం­దికి అధి­కా­రంలో ఉన్న­ప్పుడు టీడీపీ, జన­సేన పార్టీ పెద్ద­లను, వాళ్ల కుటుం­బా­లను కూడా నానా మాటలు అన­డంతో పాటు టీడీపీ ద్వితీ­య­శ్రేణి నాయ­కు­లను కేసులు పెట్టించి వేధిం­చిన నేపథ్యం ఉంది. అలాం­టి­వాళ్ల మీద ఇప్పుడు ఏవైనా చర్యలు తీసు­కుం­దా­మంటే.. ఈలోపే వాళ్లొచ్చి ఏ బీజే­పీ­లోనో చేరి­పో­తు­న్నారు. తాజాగా విశాఖ డెయిరీ ఛైర్మన్‌ ఆడారి ఆనం­ద్‌­కు­మార్‌ తన సోద­రితో కలిసి మరీ బీజేపీ తీర్థం పుచ్చు­కు­న్నారు. ఆ డెయిరీ గురించి ఇప్ప­టికే సభా­సంఘం ఏర్పా­టు­చేసి, అందు­లోని అవ­క­త­వ­కల గురించి విచా­రణ జరి­పి­స్తు­న్నారు. విచా­ర­ణలో ఒక­వేళ అక్ర­మాలు బయ­ట­ప­డితే, ఎవ­రి­మీద చర్యలు తీసు­కో­వాలి? ఇప్పుడు బీజేపీ నాయ­కు­డిగా ఉన్న ఆనంద్‌ మీద చర్యలు తీసు­కో­వడం సాధ్య­మేనా? ఇలాంటి సమ­స్యలు వస్తు­న్నం­దున అసలు వైసీపీ నుంచి ఎవ­రొ­చ్చినా తీసే­సు­కో­వడం అని కాకుండా.. కొంత అడ్డు­కట్ట పడా­లని, తగి­నం­తగా ముందు, వెనక చూసు­కున్న తర్వాతే చేరి­క­లకు ఏ పార్టీ­లో­నైనా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వా­లని నాయ­కులు అంటు­న్నారు.
కరెంటు ఛార్జీల విష­యంలో జగన్‌ మీద కాస్త గట్టి­గానే విమ­ర్శలు చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు తాము పెంచిన ఛార్జీ­లకు కూడా జగనే కార­ణ­మని చెబు­తున్నా.. ఆ విషయం ప్రజ­ల్లోకి అంతగా వెళ్ల­లేదు. తాజాగా శుక్ర­వారం రాష్ట్ర­వ్యా­ప్తంగా వైసీపీ నాయ­కులు పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీల పెంపుపై నిర­సన ప్రద­ర్శ­నలు చేశారు. ఎక్కడ చూసినా సగ­టున 50 శాతం వరకు ఇంత­కు­ముందు కంటే కరెంటు బిల్లులు పెరి­గి­పో­యా­యన్న మాట విని­పి­స్తోంది. గతంలో వెయ్యి రూపా­యలు వచ్చే­వా­రికి ఇప్పుడు 1400-1600 వస్తోంది. దీంతో ఈ విష­యంలో మాత్రం వైసీపీ వాళ్లు చెబు­తున్న మాట నిజ­మే­నని ప్రజలు కూడా అంటు­న్నారు. వైసీపీ రాష్ట్ర­వ్యా­ప్తంగా నిర్వ­హిం­చిన నిర­సన ప్రద­ర్శ­న­లకు ప్రజలు కూడా పెద్ద సంఖ్య­లోనే హాజ­రు­కా­వడం చూస్తుంటే ఈ విషయం మీద టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం జగన్‌ మీద నెపం నెట్టే­యడం కుద­ర­క­పో­వ­చ్చని స్పష్టం అవు­తోంది. దాని­కి­తోడు.. వైసీ­పీకి ఉన్నది 11 మంది ఎమ్మె­ల్యే­లే­నన్న ధీమాతో కూటమి నాయ­కులు కని­పి­స్తు­న్నారు గానీ, నిజా­నికి ఆ పార్టీ ఒంట­రిగా పోటీ చేసినా కూడా 40 శాతం ఓటు బ్యాంకు సాధిం­చిం­దన్న విష­యాన్ని విస్మ­రిం­చ­కూ­డదు.
మూడు పార్టీలూ కలిసి పోటీ చేయడం, పవన్‌ కళ్యాణ్‌ లాంటి క్రౌడ్‌ పుల్లర్‌ వాళ్ల­వైపు ఉండడం, వాట­న్నిం­టికీ తోడు వైసీపీ చేసు­కున్న కొన్ని స్వయం­కృ­తా­ప­రా­ధాలు కలిసి కూట­మిని అధి­కా­రం­లోకి తీసు­కొ­చ్చాయి. దాంతో­పాటు వైసీ­పీకి కనీసం ప్రతి­పక్ష హోదా కూడా లేక­పో­వడం, పీఏసీ ఛైర్మన్‌ లాంటి పద­వులు దక్క­క­పో­వడం లాంటి తీవ్ర­మైన అవ­మా­నాలు ఎదు­ర­య్యాయి. అయినా కూడా ఇప్పుడే.. అంటే ప్రభుత్వం ఏర్ప­డిన ఆరు నెల­ల్లోనే ప్రతి­పక్షం నిర్వ­హిం­చిన ఒక నిర­స­నకు ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు హాజ­ర­వు­తు­న్నా­రంటే ప్రభుత్వం మీద ఆ విష­యంలో అసం­తృప్తి ఉన్నట్లే అని అర్థం చేసు­కోక తప్పదు. తమ అను­కూల మీడియా సాయంతో ఎలా­గోలా నెట్టు­కొ­ద్దా­మని చంద్ర­బాబు అను­కున్నా, క్షేత్ర­స్థా­యిలో జరు­గు­తున్న విష­యా­లను పూర్తిగా పట్టిం­చు­కో­క­పో­వడం కూడా సరి­కాదు. ఇప్ప­టి­నుంచే జాగ్రత్త పడ­క­పోతే.. రాబోయే ఎన్ని­కల్లో ఏమైనా జర­గొచ్చు. కాబట్టి.. తస్మాత్‌ జాగ్రత్త బాబూ!!

మంత్రుల పని­తీరు గురిం­చిన చర్చ వచ్చి­న­ప్పుడు చంద్ర­బాబు బహి­రం­గంగా తిట్టి­న­వా­రిలో మొట్ట­మొ­దటి వ్యక్తి కార్మి­క­శాఖా మంత్రి వాసం­శెట్టి సుభాష్‌. కుర్రా­డివి కదా, ఉత్సా­హంగా చేస్తా­వని నీకు మంత్రి పదవి ఇస్తే.. కనీసం సభ్య­త్వాలు కూడా చేయిం­చ­క­పోతే ఎలా­గయ్యా? అంటూ చంద్ర­బాబు కాస్త గట్టి­గానే వేసు­కు­న్నారు. ఆయన పని­తీరు గురించి పెద్దా­యన చాలా అసం­తృ­ప్తిగా ఉన్నారు. కానీ, ఉభ­య­గో­దా­వరి జిల్లాల్లో బల­మైన శెట్టి­బ­లి­జ­లకు మంత్రి­వ­ర్గంలో ఉన్న ఏకైక ప్రతి­నిధి వాసం­శెట్టి సుభాష్‌. ఒక­వేళ ఆయ­నను తప్పిం­చా­లంటే, అదే వర్గా­నికి చెందిన మరో సీని­యర్‌ నాయ­కుడు పితాని సత్య­నా­రా­య­ణను తీసు­కో­వాలి.
– 98858 09432

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News