Saturday, January 4, 2025
HomeతెలంగాణTG Police: బౌన్సర్లతో యువకుడి హల్‌చల్.. వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

TG Police: బౌన్సర్లతో యువకుడి హల్‌చల్.. వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ కోసం కొండాపూర్‌లోని ఏఎంబీ(AMB) మాల్‌లో బౌన్సర్లతో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మాల్ రెండో ఫ్లోర్‌కు వస్తే డబ్బులు ఇస్తానంటూ తన ఫాలోవర్లకు చెబుతూ వీడియో తీశాడు. దీంతో మాల్ సెక్యూరిటీగార్డులు అడ్డుకుని ఇక్కడ అనుమతి లేకుండా ఇలాంటివి చేయకూడదని తెలిపారు. దీంతో బౌన్సర్లు వారితో వాగ్వాదానికి గురయ్యారు. ఈ విషయం పోలీసులు దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు(Telangana Police) ఎక్స్ వేదికగా బౌనర్లకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -

‘సోషల్ మీడియాలో ప్రచారం కోసం యువత చేసే పనులు వారి జీవితాలను నాశనం చేస్తాయి క్రిమినల్ కేసులతో జైలుకు వెళతారని, ఇలాంటి పనులను ప్రోత్సహించే బౌన్సర్లపై, బౌన్సర్ల ఏజెన్సీలపై కూడా అత్యంత కఠిన చట్టాలతో క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి’ అని హెచ్చరించింది. కాగా మోహన్ బాబు ఇంటి వద్ద గొడవలు, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనల్లో బౌన్సర్లు వ్యవహరించిన తీరుపై సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బౌన్సర్ల ఏజెన్సీలు నియమ నిబంధనలు పాటించాలని హెచ్చరికలు జారీ చేసిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News