Saturday, January 4, 2025
HomeఆటPawan Kalyan: నితీష్ కుమార్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్

Pawan Kalyan: నితీష్ కుమార్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్

మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) సెంచరీ చేయడంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా అభినందనలు చెబుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

‘‘నువ్వు ‘భారత్’ లోని ఏ ప్రాంతం నుంచి వచ్చావనే దానికంటే దేశం గర్వించేలా ఏం చేశావు అన్నదే ముఖ్యం. ప్రియమైన ‘నితీష్ కుమార్ రెడ్డి’ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించినందుకు అభినందనలు. ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT)లో కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో 114 పరుగులతో రాణించిన తీరు మీ ప్రతిభను తెలియజేస్తుంది. ఇలాగే మీరు మరెన్నో ప్రపంచ స్థాయి రికార్డులను సాధించాలని కోరుకుంటున్నాను. భారత్ జెండాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి యువతకు క్రీడల పట్ల అభిరుచి, దృఢ సంకల్పంతో ఆసక్తిని పెంపొందించేలా స్ఫూర్తినివ్వాలి. ఈ సిరీస్‌లో భారత్‌ ఘన విజయం సాధించాలి” అని తెలిపారు.

కాగా నితీష్ రెడ్డి తెలుగు కుర్రాడు అంటూ అందరూ విష్ చేస్తే.. పవన్ మాత్రం భారతీయుడు అంటూ విష్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News