Saturday, January 4, 2025
HomeఆటICC: ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌.. నామినేట్ అయింది వీరే

ICC: ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌.. నామినేట్ అయింది వీరే

ఐసీసీ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల పేర్లను ఐసీసీ(ICC) ప్రకటించింది. భారత్ నుంచి అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh), బాబర్ అజామ్ (పాకిస్థాన్‌), ట్రావిస్‌ హెడ్ (ఆస్ట్రేలియా), సికిందర్ రజా (జింబాబ్వే) నామినేట్ అయ్యారు. ఈ ఏడాది టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఈ అవార్డు ఇస్తారు.

- Advertisement -

ఈ ఏడాది టెస్టులు ఆడే దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. మొత్తం 18 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు తీశాడు. ఇక బాబర్ అజామ్‌ 23 ఇన్నింగ్స్‌ల్లో 33.54 సగటుతో 738 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 15 ఇన్నింగ్స్‌ల్లో 38.50 సగటుతో 539 రన్స్‌ సాధించాడు. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా 23 ఇన్నింగ్స్‌ల్లో 573 పరుగులు చేయడంతో పాటు 24 వికెట్లూ పడగొట్టాడు.

మహిళల టీ20 క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు కోసం నామినేట్ అయిన వారి పేర్లను కూడా ఐసీసీ ప్రకటించింది. వీరిలో చమరి ఆటపట్టు (శ్రీలంక), మెలీ కెర్ (న్యూజిలాండ్), లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా), ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (ఐర్లాండ్) ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News