Saturday, January 4, 2025
HomeతెలంగాణBhatti Vikramarka: రైతు భరోసాపై ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ

Bhatti Vikramarka: రైతు భరోసాపై ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ

రైతు భరోసా(Rythu Bharosa) విధివిధానాల రూపకల్పనపై సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , శ్రీధర్ బాబు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనే విషయంపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్లు, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసాకు అనర్హులుగా ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

- Advertisement -

కాగా రైతు భరోసా అమలు చేసేందుకు విధివిధానాలు రూపకల్పన చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్షాలు సహా పలువురు నిపుణులు, రైతుల సలహాలు ఈ కమిటీ స్వీకరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News