Saturday, January 4, 2025
HomeతెలంగాణMallapur: రోడ్లపై న్యూ ఇయర్ కేక్ కటింగ్, బాణాసంచా కాలిస్తే..

Mallapur: రోడ్లపై న్యూ ఇయర్ కేక్ కటింగ్, బాణాసంచా కాలిస్తే..

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా హద్దులు దాటి ప్రవర్తిస్తే, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్లాపూర్ ఎస్సై కోసన రాజు అన్నారు.

- Advertisement -

ఆనందంగా జరుపుకోండి కానీ

మండల ప్రజానీకానికి ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని, డిసెంబర్ 31 రోజున, నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకునే వాళ్లు, చట్టాన్ని అతిక్రమిస్తే, వారిపై కఠిన చార్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి రోడ్లపైన కేకులు కట్ చేయడం, బాణాసంచాలు పేల్చడం చట్టరీత్య నేరమని ఆయన తెలిపారు. ఒక్కసారి కేసులు నమోదైతే, చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్లు వాహనం నడిపితే వాహనం ఇచ్చిన వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News