Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Feminist: మహిళా స్వేచ్ఛకు వెన్నుదన్ను

Feminist: మహిళా స్వేచ్ఛకు వెన్నుదన్ను

ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకుడు, విమర్శకుడు డాక్టర్‌ ఆరుద్ర సతీమణి, స్త్రీవాద ఉద్యమ నాయకురాలు, రచయిత్రి, విమర్శకురాలు అయిన కె. రామలక్ష్మి రెండు రోజుల క్రితం తన 92వ ఏట వయోభారం కారణంగా కన్ను మూశారు. ఆమె మరణంతో స్త్రీవాదానికి ఒక ముఖ్యమైన స్తంభం నేలకొరిగినట్ట యింది. మహిళా సమస్యలను, మహిళాభ్యున్నతిని ఇతివృత్తంగా తీసుకుని వందలాది కథలు రాసిన రామలక్ష్మి దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు మహిళా విమోచనం కోసం అవిచ్ఛిన్నంగా, అవిశ్రాంతంగా కలం పోరాటం సాగించారు. నిజానికి తన వద్దకు సమస్యలతో వచ్చే మహిళలకు ఎంతో అద్భుతంగా కౌన్సెలింగ్‌ చేసేవారు. వృత్తి ఉద్యోగాల విషయంలో వారికి చక్కని మార్గదర్శనం చేసేవారు. మహిళల విషయంలో ఎవరు తప్పుగా వ రాట్లాడినా సహించేవారు కాదు. దాదాపు కొట్టినంత పని చేసేవారు. కుటుంబ సమస్యలకు సంబంధించిన తన దగ్గరకు వచ్చే మహిళల వైపు తప్పున్నా వారినే సమర్థిస్తూ మాట్లాడేవారు. స్వతంత్ర ప్రవృత్తి కలిగిన ఏ మాటనైనా, ఏ విష యాన్నయినా ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడేవారు. దేనికీ భయ పడేవారు కాదు. ఆమె రచనల్లో కూడా ఇటువంటి తత్వమే బయటపడుతుం టుంది. చెప్పదలచుకున్న విష యం కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే ఆమెకు తెలుసు.
పలువురు సినీ దిగ్గజాలతో ఆమెకు సాన్నిహిత్యం ఉండేది. సావిత్రి, భానుమతి, సూర్యకాంతం, ఎన్టీఆర్‌ భార్య బసవతారకం, ఏఎన్నార్‌ సతీమణి అన్నపూర్ణ వంటి వారితో ఆమెకు అనుబంధం ఉండేది. అందువ ల్లే ఆమె ఇటీవల కొందరు సినిమా ప్రముఖుల వ్యక్తిగత జీవితం గురించి, వ్యక్తిత్వాల గురించి పత్రికలకు, చానల్స్క ఇచ్చిన ఇంటర్వ్యూలలో వెల్లడించి సంచలనం సృష్టించారు. దేశ రాజకీయ, సామా జిక, ఆర్థిక వి షయాలను ఎంత సీరియస్‌గా చర్చించేవారో, వ్యక్తిగత విషయాలను గురించి అంతే హాస్యస్ఫూరకంగా మా ట్లాడేవారు. ఆమె రాసిన కథలలో కూడా ఇదే తీరు కనిపించేది. సామాజిక స్పృహతో పాటు, సమాజం పట్ల సరైన అవగాహన ఉండేది. సామాజిక సమస్యలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ సునిశితంగా పరిశీలిం చి సొంత అభిప్రాయాలను ఏర్పరచుకునేవారు.
తిరుగులేని విమర్శకురాలు
తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడకు దగ్గరలో ఉన్న కోటనందూరు గ్రామంలో 1930 డిసెంబర్‌ 31న జన్మించిన రామలక్ష్మి, చదువుల్లో చాలా చక్కగా రాణించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టాతీ సుకుని, ఆ తర్వాత ఇంగ్లీష్‌, తెలుగు సాహిత్యాలను కాచి వడబోశారు. ‘తెలుగు స్వతంత్ర’లో ఇంగ్లీషు విభా గానికి ఉప సంపాదకులుగా పనిచేశారు. మహిళా సంక్షేమ సంస్థల్లో పని చేశారు. మొదటి నుంచి మహిళల సమస్యలను చాలా సన్నిహితంగా పరిశీలిస్తూ వస్తున్నందువల్ల మహిళల సమస్యలను, వాటి పరిష్కారాల నే ఇతివృత్తాలుగా తీసుకుని 1951 నుంచి రచనలు చేయడం మొదలుపెట్టారు. 1954లో ఆరుద్రతో (భాగ వతుల సదాశివ శాస్త్రితో) వివాహం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆమె రామలక్ష్మీ ఆరుద్ర అనే కలం పేరు. తో రచనలను కొనసాగించారు. ‘విడదీసే రైళ్లు’, ‘మెరుపు తీగ’, ‘ఆంధ్ర నాయకుడు’, ‘అవతలి గట్టు’ వంటి ఆమె రచనలు తెలుగునాట తీవ్ర సంచలనం సృష్టించి, చర్చనీయాంశాలయ్యాయి.
భర్తకు దీటుగా ఆమె అనేక సాహితీ విమర్శలు కూడా రచించారు. విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. ఆ మె కలం నుంచి వెలువడిన కథల్లో ఎక్కువగా స్త్రీవాద ధోరణులే వ్యక్తమయ్యేవి. భర్తతో పాటు ఆమె కూడా తెలుగు సాహితీ రంగానికి ఎనలేని సేవ చేశారని చెప్పాలి. 1954కు ముందు, అంటే రామలక్ష్మితో వివాహం కావడానికి ముందు ఆరుద్ర చేసిన సాహిత్య సేవకు, రామలక్ష్మితో వివాహం అయిన తర్వాత ఆయన చేసిన సాహిత్య సేవకు ఎంతో తేడా ఉందని పరిశీలకులు చెబుతుంటారు. కారణం, ఆయన పండించే సాహి త్యానికి మొదటి విమర్శకురాలు రామలక్ష్మి. ఆమె మెప్పు పొందిన తర్వాతే ఆయన పాటైనా, పద్యమైనా, వ్యా సమైనా, పరిశోధనైనా బయటికి వచ్చేది. బహుశా ఆ కారణంగానే ఆయన సాహిత్యం ఇప్పటికీ జనం మన సు పటిష్ఠంగా పదిలంగా నిలిచిపోయింది. సాధారణంగా ఆ దంపతుల మధ్య సాహి త్య సంబంధమైన చర్చలే జరుగుతుండేవి. వామపక్ష భావజాలాన్ని నరనరానా జీర్ణించుకున్న అరుద్ర పురాణ కథలు, పౌరాణిక పాటలు, గేయాలు రాయగలిగారంటే అందుకు చాలావరకు రామలక్ష్మీ కారణమని సన్నిహితులు చెబు తుంటారు. ఆమె సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News