Saturday, January 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: కాకినాడ తీర ప్రాంతంలో తాబేళ్ల మరణం.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Pawan Kalyan: కాకినాడ తీర ప్రాంతంలో తాబేళ్ల మరణం.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు

కాకినాడ(Kakinada) బీచ్ రోడ్, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అత్యధిక సంఖ్యలో మరణిస్తుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విచారణకు ఆదేశించారు. తాబేళ్ల మరణానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఇందుకు కారకులు ఎవరో తెలుసుకుని చర్యలు చేపట్టాలని వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని పేర్కొన్నారు.

- Advertisement -

మరోవైపు కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ పరిశ్రమలో తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాకలపూడి ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఉన్న ఈ కంపెనీ నుంచి కాలుష్యకారక దుర్గంధం వెలువడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఫిర్యాదులు చేశారు. దీనిపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఛైర్మన్ కృష్ణయ్య, పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శంకరరావుతో ఫోన్‌లో పవన్ మాట్లాడారు.

ఈ సంస్థ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందో..? లేదో? పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య సమస్యలు లేకుండా చూడాలని స్పష్టంచేశారు. ఆయన ఆదేశాలలో అధికారులు కంపెనీని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ముడి పదార్థాలు వాడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News