Monday, May 19, 2025
HomeఆటRavi Shastri: ఫ్లాప్ షో.. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

Ravi Shastri: ఫ్లాప్ షో.. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ(Rohit Sharma), స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) విఫలమవుతున్నసంగతి తెలిసిందే. తాజాగా బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేశాడు. మరోవైపు ఇదే మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ.. తర్వాత 7, 11, 3, 36, 5 పరుగులు మాత్రమే చేసి నిరుత్సాహ పరిచాడు.

- Advertisement -

ఇక రోహిత్ శర్మ మూడు టెస్టుల్లో కలిపి 31 పరుగులు మాత్రమే చేశాడు. వరుసగా 3, 6, 10, 3, 9 పరుగులు చేశాడు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ రోహిత్, కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. దీంతో వారిద్దరు టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో వారిద్దరి రిటైర్మెంట్ వార్తలపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) స్పందించారు. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ దృష్ట్యా మరో మూడేళ్లు టెస్టు క్రికెట్ ఆడే అవకాశాలున్నాయని తెలిపారు. అయితే రోహిత్ శర్మ మాత్రం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిశాక రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News