జనసేన పార్టీ కార్యదర్శి నాగబాబుకు(Naga Babu) మంత్రి పదవి వార్తలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించారు. తన సోదరుడు ముందు ఎమ్మెల్సీ అవుతారని.. తర్వాత మంత్రి పదవి గురించి ఆలోచిస్తామన్నారు. తనతో పాటు అన్నయ్య పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపారు. వైసీపీ నేతలతో తిట్లు తిన్నారని.. పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారని పేర్కొన్నారు. ఇక్కడ కులం, బంధుప్రీతి ముఖ్యం కాదని.. పనిమంతుడా కాదా? అన్నది చూడాలన్నారు.
ఎన్నికల సమయంలో ఎంపీగా ప్రకటించి తప్పించామన్నారు. అలాగే రాజ్యసభకు పంపాలని అనుకున్నామని కానీ కుదరలేదన్నారు. కందుల దుర్గేశ్(Kandula Durgesh) ఏ కులమో తనకు తెలియదని ఆయన పనితీరు నచ్చడంతోనే మంత్రి పదవి ఇచ్చామని చెప్పారు. రాజకీయాల్లో పని తీరు ప్రామాణికం కాావాలని కులం కాదన్నారు. నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), హరిప్రసాద్(Hariprasad) తొలి నుంచి పార్టీ కోసం పని చేశారని గుర్తుచేశారు. వారి ప్రతిభ చూసే పదవులు ఇచ్చామని ఆయన వెల్లడించారు.