Sunday, January 5, 2025
Homeఆంధ్రప్రదేశ్Bandi Sanjay: రేవంత్ రెడ్డిపై పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay: రేవంత్ రెడ్డిపై పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తనదైన శైలిలో స్పందించారు. రేవంత్ గురిచి పవన్ కళ్యాణ్ ఏమన్నారో తనకు తెలియదన్నారు. నిజంగా రేవంత్ గొప్ప నాయకుడని పవన్ అని ఉంటే ఆయనలో ఏం కన్పించిందో తెలియదన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని విమర్శించారు.క్రైమ్ రేట్ పెరిగిందని..ఇలాంటి వ్యక్తి పవన్ కల్యాణ్‌కు ఎలా గొప్పగా కనిపించారో తెలియడం లేదని తెలిపారు.

- Advertisement -

ఇక సీఎం రేవంత్ రెడ్డికి, హీరో అల్లు అర్జున్‌(Allu Arjun)కు ఎక్కడో చెడిందన్నారు. ‘పుష్ప3’ రిలీజ్‌కు ముందే సినిమా చూపిస్తున్నారని చెప్పారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టై జైలుకు వెళ్లి రావడంతో సమస్య ముగిసిందన్నారు. మళ్లీ దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టడం అనవసరమని పేర్కొన్నారు.ఆరు గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అల్లు అర్జున్‌ను పావులా వాడారని విమర్శలు చేశారు. రేవతి భర్త కేసు వాపస్ తీసుకుంటానని ప్రకటించినా.. ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో తెలియడం లేదని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News