Sunday, January 5, 2025
Homeఆంధ్రప్రదేశ్Free Bus Scheme: మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడంటే..?

Free Bus Scheme: మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడంటే..?

ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకం(Free Bus Scheme) హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలోని మహిళలు ఈ పథకం అమలు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఉచిత బస్సు పథకం ఎప్పడు అమలు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

- Advertisement -

ఉగాది పండుగ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఈ మేరకు పలువురు ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరుపుతున్నారు. సచివాలయంలో తాజాగా నిర్వహించిన సమావేశంలో రవాణాశాఖ మంత్రి రాం ప్రసాద్‌రెడ్డి, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీఎండీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అంశంపై తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామని సీఎంకు తెలిపారు. దీంతో వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.

కాగా ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఇప్పటికే మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి సిఫారసు చేయాలని కమిటీకి సూచించింది. రవాణాశాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి సారథ్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో కన్వీనర్‌గా రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, సభ్యులుగా మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణికి చోటు కల్పించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News