Tuesday, January 7, 2025
Homeచిత్ర ప్రభPrabhas: 2024లో నెంబర్ వన్‌గా ప్రభాస్ సినిమా

Prabhas: 2024లో నెంబర్ వన్‌గా ప్రభాస్ సినిమా

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన కల్కి 2898 ఏడీ(Kalki 2898AD) సినిమా 2024 ఏడాదిలో నెంబర్ వన్‌ సినిమాగా నిలిచింది. ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ పోర్టల్ IMDB ప్రతి ఏటా దేశంలోని సినిమాల ఫాలోయింగ్ గురించి సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాది మోస్ట్ పాపులర్ విభాగంలో టాప్ పొజిషన్ ఉన్న సినిమాల జాబితాను విడుదల చేసింది.

- Advertisement -

ఇందులో ప్రభాస్ నటించిన కల్కి సినిమా తొలి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్ నటించిన ‘స్త్రీ’ సినిమా రెండో స్థానంలో నిలిచింది. మూడు, నాలుగు స్థానాల్లోవిజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సైతాన్’ నిలిచాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’, మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’ , కార్తీక్ ఆర్యన్ నటించిన ‘భూల్ భూలయ్య 3’, ‘కిల్’, అజయ్ దేవగణ్ ‘సింగం ఎగైన్’, ‘లాపతా లేడీస్’ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News