Saturday, April 19, 2025
HomeతెలంగాణKTR: నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా..?: కేటీఆర్

KTR: నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా..?: కేటీఆర్

పదేళ్ల కేసీఆర్(KCR) పాలనలో ప్రతిభ చాటిన గురుకులాల విద్యార్థులు నేడు గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోదించడమా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రశ్నించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా. కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన నా తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా. దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలి కేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపాం. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నమో రామచంద్రా అని ఆకలి కేకలా. పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకులాల్లో చదువుకుని ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులు .. నేడు గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోదించడమా. సిగ్గు సిగ్గు .ఇది పాలకుల పాపం. విద్యార్థులకు శాపం. జాగో తెలంగాణ జాగో” అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News