టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల అస్వస్థతకు గురి కావడంలో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయన మెదడులో రక్తం గడ్డ కటినట్లు గుర్తించారు. కొద్దిగా మతిమరుపు కూడా వచ్చిందని..సరిగా ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని వైద్యులు పేర్కొన్నారు. అయితే తాజాగా ఆసుపత్రి సిబ్బందితో కలిసి పాటలు పాడుతూ.. డ్యాన్స్ చేస్తూ. కాంబ్లీ ఉల్లాసంగా గడిపారు. ‘చక్ దే ఇండియా’ పాటకు హుషారుగా స్టెప్పులేశారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే కాంబ్లీకి చికిత్స అందించేందుకు 1983 వన్డే ప్రపంచకప్ విజేత టీమ్ సిద్ధంగా ఉందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(Kapil Dev) ఇటీవల ప్రకటించిన విషయం విధితమే. అయితే రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్తేనే సాయం చేస్తామని షరతు విధించారు. ఇందుకు కాంబ్లీ కూడా అంగీకరించారు. మొత్తానికి 1990ల్లో తన ఆట తీరుతో అలరించిన కాంబ్లీ.. తన ప్రవర్తనతో క్రికెట్ కెరీర్‌కు దూరమై వ్యసనాలకు బానిసయ్యారు. లేదంటే తనకున్న నైపుణ్యంలో సచిన్‌తో పాటు పేరు ప్రఖ్యాతలు దక్కించుకునే వారని క్రీడా విశ్లేషకులు చెబుతూ ఉంటారు.