Tuesday, January 7, 2025
Homeఆంధ్రప్రదేశ్Inter Students: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం న్యూఇయర్ గిఫ్ట్

Inter Students: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం న్యూఇయర్ గిఫ్ట్

కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు(Inter Students) నూతన సంవత్సరం కానుక అందించింది. జనవరి 1 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన(Mid Day Meals) పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది.

- Advertisement -

దారిద్ర్య రేఖకు దిగువన పేదరికంలో ఉన్న విద్యార్థులు.. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపింది. రేపటి నుంచి 475 జూనియర్ కాలేజీల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం రూ.115 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. కాగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల స్థాయి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News