Friday, November 22, 2024
HomeతెలంగాణHyd: మహిళా యూనివర్సిటీ ఫస్ట్ వీసీగా విజ్జుల్లత

Hyd: మహిళా యూనివర్సిటీ ఫస్ట్ వీసీగా విజ్జుల్లత

తెలంగాణ రాష్ట్ర మహిళా విశ్వవిద్యాలయం మొదటి ఉపకులపతిగా ఆచార్య ఎం. విజ్జుల్లత నియామకం ప‌ట్ల దళిత మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక మహిళా విశ్వ విద్యాలయానికి సీనియర్ ప్రొఫెసర్‌, దళిత మహిళకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావుకి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రొఫెసర్ విజ్జుల్లత నేతృత్వంలో మహిళా విశ్వవిద్యాలయం అన్నివిధాలుగా పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ విప్ లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్ ఎస్ ప్రభాకర్, క్రాంతి కిరణ్, చిరుమర్తి లింగయ్య, ఆరూరి రమేశ్, సండ్ర వెంకటవీరయ్య, గ్యాదరి కిశోర్, హన్మంత్ షిండే, మానిక్ రావు, అబ్రహం, కడియం శ్రీహరి, రాజేశ్వర్, తదితరులు విజ్జుల్లతకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రొ. ఎం. విజ్జుల్లత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పని చేశారు. బోధన విధులతో పాటు పలు పరిపాలనపరమైన పదవులు నిర్వహించారు. వారు యూజీసీ వ్యవహారాల డీన్‌గా, కోఠీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కోఠీ మహిళా కళాశాల ప్రాంగాణాన్నే విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తున్నారు. మహిళా విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతిగా నియమితులైన ప్రొఫెసర్ విజ్జుల్లత గారు కూడ కోఠీ కళాశాల పూర్వ విద్యార్థే కావడం మరో విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News