దేశంలో బీజేపీ పాలనలో ఏది కొనాలన్నా అగ్గిలో చేయిపెట్టనట్టు ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా పెరుగు, పాలు, నెయ్యి మీద పన్నులు విధించలేదని, కానీ పాలు, పెరుగు, నెయ్యి మీద బీజేపీ ప్రభుత్వం పన్నులు వేస్తోందని విమర్శించారు. ఈరోజు మార్కెట్ కి పోయి ఏదైనా కొనాలని చూస్తే అగ్గిల చెయ్యి పెట్టే పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. ఈరోజు ఏది కొన్ని పరిస్థితి లేదని అన్నారు. కందిపప్పు, నూనెలతో పాటు ఇతర నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని వివరించారు. ముఖ్యంగా సిలిండర్ ధరలు చూస్తే మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్నిటిపై సబ్సిడీలు ఇచ్చి ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కాబట్టి మన కోసం ఎవరు పనిచేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ రామ్ లీలా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత మంత్రులు గంగుల కమలాకర్ , సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. తొలుత ఎల్ఎండీ కాలనీ లోనీ అమరవీరుల స్థూపం వద్ద వీరు నివాలుళర్పించారు. అనంతరం ర్యాలీగా రామ్ లీలా మైదానానికి బయలుదేరి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితకు స్థానికులు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.