Saturday, April 5, 2025
HomeతెలంగాణTET Exams: ఆల్ ది బెస్ట్.. టెట్ పరీక్షలు ప్రారంభం

TET Exams: ఆల్ ది బెస్ట్.. టెట్ పరీక్షలు ప్రారంభం

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(TET Exams) పరీక్షలు ప్రారంభమయ్యాయి. టెట్ పరీక్షకు మొత్తం 2,75,753 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్‌-1కు 94,327 మంది, పేపర్‌-2కు 1,81,426 మంది ఆప్లై చేసుకున్నారు. 10 రోజుల పాటు 20 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు కొనసాగనున్నాయి.

- Advertisement -

ఉద‌యం సెష‌న్‌కు హాజ‌ర‌య్యే అభ్యర్థుల‌ను ఉద‌యం 7.30 గంటల నుంచి.. మ‌ధ్యాహ్నం సెష‌న్‌కు హాజ‌ర‌య్యే వారిని మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల నుంచి ప‌రీక్షా కేంద్రాల్లోకి అనుమ‌తిస్తారు. ఇక పరీక్ష మొదలయ్యే 15 నిమిషాల ముందే ప‌రీక్షా కేంద్రం గేట్లను మూసివేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 జిల్లాల్లో 92 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలను నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News