Wednesday, January 8, 2025
Homeఆంధ్రప్రదేశ్Diwakar Travels: జేసీ దివాకర్ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

Diwakar Travels: జేసీ దివాకర్ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన ట్రావెల్స్‌ బస్సు(Diwakar Travels) బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో దివాకర్ ట్రావెల్స్ కార్యాలయం వద్ద గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం నాలుగు బస్సులను అక్కడ నిలిపి ఉంచగా వీటిలో ఒకటి మంటల్లో కాలిపోయింది. మరొకటి పాక్షికంగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

- Advertisement -

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాలిన బస్సు సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడి ఉన్నాయి. దీంతో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేదా ఆకతాయిలు కావాలనే చేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News