పట్టపగలు.. జనమంతా చూస్తూండగా.. నడిరోడ్డుపై ఓ ఇల్లాలు తన సొంత భర్తనే దారుణంగా చంపేసింది. ఈ ఘటన ఏపీలోని బాపట్ల(Bapatla) జిల్లాలో చోటుచేసుకుంది. అమరేందర్ అనే కుటుంబం కొంతకాలంగా నిజాంపట్నం మండలం కొత్తపాలెంలో నివాసం ఉంటోంది. అయితే మద్యానికి బానిసైన భర్త రోజు భార్యతో గొడవపడుతుండేవాడు. అలాగే ఇవాళ కూడా గొడవ పడటంతో మాటామాటా పెరిగి ఇద్దరు రోడ్డుపైకి వచ్చారు.
విచక్షణ కోల్పోయిన భార్య.. భర్త తలపై కర్రతో బలంగా కొట్టింది. దీంతో కిందపడిన వెంటనే అమరేందర్ గొంతుకు తాడుతో గట్టిగా ఉరేయడంతో అక్కడిక్కక్కడే మృతి చెందాడు. సినిమా చూసినట్లు జనం చూస్తున్నారే కానీ ఏ ఒక్కరూ ఆమెను ఆపడానికి ముందుకు రాలేదు. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు. అమరేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.