Wednesday, January 8, 2025
HomeతెలంగాణV.C. Sajjanar: ఈజీ మనీకోసం బెట్టింగ్‌కు అలవాటు పడొద్దు: సజ్జనార్

V.C. Sajjanar: ఈజీ మనీకోసం బెట్టింగ్‌కు అలవాటు పడొద్దు: సజ్జనార్

ఈజీ మనీకోసం బెట్టింగ్‌(Online Betting)కు వ్యసనపరులై జీవితాలను ఛిద్రం చేసుకోవద్దని ఐపీఎస్ అధికారి, టీజీఆర్టీసీ చైర్మన్ వీసీ సజ్జనార్(V.C. Sajjanar) తెలిపారు. బెట్టింగ్‌కు వ్యసనపరులై తమ బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారుని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

‘ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అనేది చాపకింద నీరులా విస్తరిస్తోంది.. ఎంతో మంది అమాయకులు తమకు తెలియకుండానే బెట్టింగ్‌కు వ్యసనపరులై తమ బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువగా బెట్టింగ్‌కు ఆకర్శితులవుతున్నారు. చిత్ర విచిత్ర మాటలతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బెట్టింగ్‌ కూపంలోకి లాగుతున్నారు. వారి మాటలు నమ్మి ఈ బెట్టింగ్ యాప్‌లను వ్యసనంగా మార్చుకుని అధిక వడ్డీలకు అప్పులు చేసి భారీ మొత్తంలో కూరుకుపోతున్నారు.

తమ స్వార్థం కోసం ఇతరులను బెట్టింగ్‌లోకి ఇన్‌ఫ్లుయెన్సర్లు లాగుతున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించే సంఘ విద్రోహ శక్తుల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలని, మీ చుట్టుపక్కల ఎవరైనా బెట్టింగ్‌ వల్ల ఇబ్బందులు పడుతుంటే వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. బెట్టింగ్‌ బాధితులు మౌనంగా ఉండటం సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని, మీరు దైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారు అవడంతో పాటు ఇతరులు బెట్టింగ్‌ వైపునకు ఆకర్షితులు కాకుండా చేయవచ్చు. కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థదాయకమైనదని గుర్తించాలి. ఈజీ మనీకోసం బెట్టింగ్‌కు వ్యసనపరులై జీవితాలను ఛిద్రం చేసుకోవద్దు” అని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News