Wednesday, January 8, 2025
Homeచిత్ర ప్రభHema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట

Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట

బెంగళూరు రేవ్ పార్టీ(Rave Party)కేసులో తెలుగు నటి హేమకు(Hema) ఊరట లభించింది. ఈ కేసులో తదుపరి చర్యలపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. తనపై నమోదైన డ్రగ్స్ కేసు కొట్టివేయాలని ఆమె గతంలో పిటిషన్ దాఖలు చేశారు. తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. రేవ్‌ పార్టీలో హేమ డ్రగ్స్ వినియోగించినట్లు ఆధారాలు లేకపోవడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

కాగా గత ఏడాది మే నెలలో బెంగళూరు సిటీకి సమీపంలో ఓ ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. 80 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో హేమ కూడా ఉన్నారు. అయితే అదే సమయంలో తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని హేమ ఓ వీడియో రిలీజ్ చేయడంతో.. ఆమె ఫొటోను పోలీసులు విడుదల చేశారు. కృష్ణవేణి పేరుతో హేమ పార్టీకి హాజరైనట్లు తెలిపారు. హేమ విచారణకు హాజరుకాకపోవడంతో గతేడాది జూన్ 3న పోలీసులు అరెస్ట్‌ చేశారు. 10 రోజుల పాటు జైలులో ఉండి బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా ఈ కేసులో ఆమెపై చర్యలు తీసుకోకుండా హైకోర్టు స్టే విధించడంతో హేమకు ఊరట దక్కింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News