Wednesday, January 8, 2025
Homeచిత్ర ప్రభPushpa2: ‘పుష్ప2’ నుంచి 'జాతర' వీడియో సాంగ్ వచ్చేసింది

Pushpa2: ‘పుష్ప2’ నుంచి ‘జాతర’ వీడియో సాంగ్ వచ్చేసింది

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ (Sukumar) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్‌’ (Pushpa 2 The Rule). భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. అద్భుతమైన నటనతో బన్నీ, రష్మిక మందన్నా(Rashmika Mandanna) , ఫహాద్ పాజిల్ అభిమానులకు కట్టిపడేశారు.

- Advertisement -

తాజాగా మూవీ నుంచి ‘జాతర'(Jathara) వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. సినిమాలో కీలకమైన ఈ జాతార సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది. ఒకే సీక్వెన్స్‌లో సాంగ్, ఫైట్, ఎమోషనల్ సీన్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ‘గంగో రేణుక తల్లి’ అంటూ సాగే ఈ పాటలో అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ ఆకట్టుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కేవలం 28 రోజుల్లోనే దాదాపు రూ.1800కోట్లు వసూలు చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర లిఖించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News