బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు(Kambhampati Haribabu) ఒడిశా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు ఆ రాష్ట్ర రాజ్ భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధరి శరణ్ సింగ్ (Chakradhari Sharan Singh), హరిబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ (CM Mohan Charan Majhi), మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా గతంలో హరిబాబు వైజాగ్ ఎంపీగా పనిచేసిన సంగతి తెలిసిందే. అనంతరం మిజోరం రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
Kambhampati Haribabu: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES