బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతోన్న చివరి టెస్ట్‌లో భారత్(India) 185 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాట్స్‌మెన్లు ఆసీస్ పేసర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (40) మినహా మరెవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
రవీంద్ర జడేజా (26), శుభ్‌మన్ (20), బుమ్రా (22) తమ వంతు పాత్ర పోషించారు. విరాట్ కోహ్లీ (17), వాషింగ్టన్ సుందర్ (14), యశస్వి జైస్వాల్ (10) పరుగులు సాధించారు. నితీశ్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ (4) విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4, మిచెల్ స్టార్క్ 3, కమిన్స్ 2, నాథన్ లైయన్ ఒక వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచులో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వగా.. బుమ్రా కెప్టెన్సీ చేపట్టాడు. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.