Thursday, September 19, 2024
Homeనేషనల్Patanjali Ayurved: 'పతంజలి' పేరుపై వివాదం.. బాబా రామ్‌దేవ్‌కు బీజేపీ ఎంపీ హెచ్చ‌రిక‌లు

Patanjali Ayurved: ‘పతంజలి’ పేరుపై వివాదం.. బాబా రామ్‌దేవ్‌కు బీజేపీ ఎంపీ హెచ్చ‌రిక‌లు

Patanjali Ayurved: ప‌్ర‌ముఖ యోగా గురు బాబా రాందేవ్ పతంజ‌లి బ్రాండ్ పై ఆయుర్వేదిక్‌కు సంబంధించిన వివిధ ఉత్ప‌త్తుల‌ను మార్కెటింగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా ప‌తంజ‌లి పేరుపై పెద్దెత్తున్న వ్యాపారం జ‌రుగుతోంది. ఏడాదికి కొన్ని వంద‌ల కోట్ల ట‌ర్నోవ‌ర్ న‌డుస్తోంది. ప‌తంజ‌లి అనేపేరు ఆధ్యాత్మిక భావాన్ని క‌లిగిస్తుంది. దీనికితోడు ఈ బ్రాండ్ కింద విక్ర‌యించేంది ఆయుర్వేదిక్ ప‌ద్ద‌తిలో త‌యారుచేసిన ఉత్ప‌త్తులు కావ‌డంతో భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు వీటిని కొనుగోలు చేస్తున్నారు. తాజాగా బాబా రాందేవ్ పతంజ‌లి పేరు వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. బాబా రాందేవ్‌, పతంజలి గ్రూప్ ఎండీ బాలకృష్ణలపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఫైర్ అయ్యాడు.

- Advertisement -

ఆధునిక యోగా పితామహుడిగా భావించే మహర్షి పతంజలి పేరును ఉపయోగించుకుని పతంజలి వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారని బీజేపీ ఎంపీ ఆరోపించారు. మీ బ్రాండ్‌లో ఈ పేరును ఉపయోగించడం మానేయాలని, మీ సొంత పేరుతో మీ బ్రాండ్‌ను నిర్మించుకోండి అంటూ సూచించారు. పతంజలి పేరును వారి వ్యాపార సంస్థకు తీసివేయాలని, పేరుమార్చకుంటే ఉద్యమాన్ని లేవనెత్తుతానని, న్యాయపరమైన చర్యలకు దిగుతామని ఎంపీ హెచ్చరిక‌లుసైతం చేశారు.

ల‌క్నోకు తూర్పున 140 కిలోమీటర్ల దూరంలోఉన్న కొండార్ గ్రామ పంచాయతీలోని మహర్షి పతంజలి జన్మస్థలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలుచేశారు. రామ్‌దేవ్ వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటంలో నాకేమీ అభ్యంతరం లేదు. కానీ, పంతంజలి పేరుమీద నెయ్యి, నూనె, సబ్బు, మసాలాలు, లోదుస్తులు, ప్యాంటు వ్యాపారం చేయడం సముచితమేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ హక్కు ఆయ‌న‌కు ఎవరు ఇచ్చారని బీజేపీ ఎంపీ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News