Tuesday, January 7, 2025
Homeనేషనల్HMPV Virus: చైనాను వణికిస్తోన్న వైరస్‌పై భారత ప్రభుత్వం కీలక ప్రకటన

HMPV Virus: చైనాను వణికిస్తోన్న వైరస్‌పై భారత ప్రభుత్వం కీలక ప్రకటన

ప్రపంచానికి కరోనా(Corona) వైరస్ సృష్టించిన బీభత్సం మానవాళి ఇంకా మర్చిపోలేదు. ఆ జాడలు తలుచుకుంటేనే ఇప్పటికీ ఎన్నో ఇళ్లల్లో కన్నీటి నిశ్శబ్ధ ఛాయలు కనిపిస్తాయి. అంతలా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణింకించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెలల తరబడి ప్రపంచమంతా స్తంభించపోయింది. ఆ భయంకరమైన రోజులు మర్చిపోకముందే మరో వైరస్ చైనా(China)ను వణికిస్తోందన్న వార్తలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.

- Advertisement -

ప్రస్తుతం చైనాలో HMPV(హ్యూమన్ మెటాన్యూమో) అనే వైరస్ శరవేగంగా విస్తరిస్తుంది. ఈ వైరస్ సోకిన బాధితులతో చైనా ఆసుపత్రులు నిండిపోయాయి. దీంతో ఈ వైరస్‌పై భారత ప్రభుత్వం స్పందించింది. దీనిపై ఎలాంటి ఆందోళణ చెందవద్దని ఇండియన్ హెల్త్ ఏజన్సీ ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌లో అలాంటి వైరస్ జాడ లేదని తెలిపింది. మరోవైపు ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులను నిశితంగా పరిశీలించాలని సూచించింది. కాగా కరోనా సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈ వైరస్ సోకినా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News