Tuesday, January 7, 2025
HomeTS జిల్లా వార్తలుమహబూబ్ నగర్Jadcharla: విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయత భావాన్ని పెంపొందించాలి

Jadcharla: విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయత భావాన్ని పెంపొందించాలి

డైరీ లాంచ్

విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయత భావాన్ని పెంపొందించాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర 2025 డైరీ ని శుక్రవారం హైదరాబాద్ లో శాసనమండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి తో కలిసి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఉపాధ్యాయులు దిక్సూచి లాంటివారని, ఉపాధ్యాయులు కొత్త ఉత్సాహంతో పనిచేయాలని అన్నారు. కేంద్రం జాతీయ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. శాసనమండలి సభ్యులు ఏవియన్ రెడ్డి మాట్లాడుతూ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ వర్గానికి 4 డీఏలను, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హనుమంత రావు, సురేష్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లం సునీల్ కుమార్, గడ్డం బాబు నాయుడు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News