Wednesday, January 8, 2025
Homeచిత్ర ప్రభBrahmamudi Serial: దొంగతనానికి స్కెచ్ వేసిన అనామిక.. ఈసారైనా కావ్య జాగ్రత్తగా ఉంటుందా..

Brahmamudi Serial: దొంగతనానికి స్కెచ్ వేసిన అనామిక.. ఈసారైనా కావ్య జాగ్రత్తగా ఉంటుందా..

ఈ రోజు ఎపిసోడ్‌లో ‌రాజ్ కావ్య బయటనుంచి ఇంట్లోకి వస్తుండగా రండి రండి మీకోసమే మేము అందరం ఇక్కడ ఎదురు చూస్తున్నాము, షికార్లు పూర్తయ్యయా అని రుద్రాణి వెటకారంగా అంటుంది. షికారులకు కాదు వెళ్లింది, అయినా భార్యాభర్తలు కలిసి వెళ్తే నీకేంటి కడుపులో మంట అని అంటుంది కావ్య. నువ్వు ఎక్కడికైనా వెళ్తే మాకేంటి, మీకు అయితే ఏసీ కార్లు కావాలి, ఇంట్లో వాళ్లు బయటికి వెళ్లడానికి ఒక్క కారు కుడా అక్కర్లేదా అని నిలదీస్తుంది ధాన్యలక్ష్మి. మాకు ఎవరికీ చెప్పకుండా కార్లు పంపించే అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని అడిగితే ఎవరిని అడగాలి, ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఈ ఇంటి మీద సర్వహక్కులు తాతయ్య గారు నాకు ఇచ్చారు అని కావ్య చెప్తుంది.
తిండి విషయంలో కార్ల విషయంలో కుడా హక్కులు ఇచ్చారా అని రుద్రాణి అడగడంతో అవును మీకు నచ్చకపోయినా నేను చెప్పింది వినాల్సిందే అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది కావ్య. భార్య మాటలకి రాజ్ ఏమి మాట్లాడవు ఏంట్రా అని ప్రకాశం అనడంతో నాకు పాకెట్ మనీ కావాల్సినా తననే డబ్బులు అడుగుతున్నాను నేనెరికి చెప్పుకోవాలి అని వెళ్ళిపోతాడు రాజ్. కావ్య అలా మాట్లాడటం నచ్చలేదని అక్కడి నుంచి ప్రకాశం వెళ్లిపోతాడు.

- Advertisement -

గదిలోకి వెళ్లిన రాజ్ కుటుంబాన్ని కలపాలి అనుకుంటే రోజురోజుకీ గొడవలు పెరుగుతున్నాయని ఇందాక నువ్వు అన్న మాటలు నాకు నచ్చలేదు చాలా దారుణంగా మాట్లాడావు అన్నాడు రాజ్. అలా మాట్లాడకపోతే నేను వాళ్ళు అడిగే కోరికలు తీర్చలేను అంటుంది కావ్య. లక్షలు అప్పులు చేయలేను అంటుంది. అందుకోసం ఇంట్లోవాళ్లకి దూరమవుతావేమో అనడంతో నేను ఎందుకు చేస్తున్నానే మీకు నిజం తెలుసు కదా మీరు నమ్మితే చాలు అని అంటుంది. నిజం చెప్పి గొడవలు పెద్దవి చేసే కంటే ఇదే మంచిది. మన అప్పు తిరిగి ఇచ్చే వరకు లేదా వాడు దొరికేవరకు ఇదే కంటిన్యూ అవుతుంది అంటుంది కావ్య.

మరోవైపు ఇందిరా దేవి మీ నాన్నగారికి ఆరోగ్యం బాగోనప్పటి నుంచి ఇంట్లో పరిస్థితులు చాలా మారిపోయాయి. కావ్య ప్రవర్తన ఎవరికి నచ్చట్లేదు అంటుంది. కావ్య ప్రవర్తన బాగానే ఉంది కానీ నిర్ణయాలు అందరికీ నచ్చేలా ఉండాలి అని సుభాష్ అంటాడు. దానికి తోడు ఆ రుద్రాణి ఇంకా గొడవలు పెద్దది చేస్తుంది అంటుంది. ఇంట్లో పరిస్థితిల గురించి అపర్ణ, సుభాష్, ఇందిరా దేవి ఆలోచిస్తూ కావ్య రాజ్‌లతో మాట్లాడాలి అనుకుంటారు. మరోవైపు నందగోపాల్ చేసిన పనికి చెంప పగలగొడుతుంది అనామిక. అప్పుడు సామంత్ జరిగినదంతా వదిలేయి, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు అంటాడు. చెప్పింది వినకపోతే పోలీసులకు అప్పగిస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఇకపై అలాంటి పనులు చేయను, మీరు చెప్పినట్టే వింటాను అని నందగోపాల్ అంటాడు. ఇంట్లో రాజ్, కావ్య డిజైన్స్ గీస్తూ జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటారు. తరువాత ఉదయం ఇంట్లో వాళ్ళు పిలుస్తున్న పట్టించుకోకుండా రాజ్, కావ్య హడావిడిగా పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతారు. ఆఫీసులో నగలు పనిలో నిమగ్నం అవుతారు. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత అపర్ణ భోజనం చేయమని పిలవడంతో మాకు ఆకలిగా లేదు తర్వాత తింటామని వెళ్ళిపోతారు రాజ్, కావ్య.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News