Wednesday, January 8, 2025
Homeఆంధ్రప్రదేశ్Janasena Plenary: పిఠాపురంలో జనసేన ప్లీనరీ.. తేదీలు ఖరారు

Janasena Plenary: పిఠాపురంలో జనసేన ప్లీనరీ.. తేదీలు ఖరారు

కూటమి ప్రభుత్వంలో జనసేన(Janasena)పార్టీ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), కందుల దుర్గేశ్ మంత్రులు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టాలని నిర్ణయించారు. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మార్చి 12, 13, 14 తేదీల్లో ప్లీనరీ(Janasena Plenary) నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ప్లీనరీ సన్నాహాలపై కోర్ కమిటీ సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది.

- Advertisement -

ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ పదేళ్ల పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పవన్ బలంగా నిలబడ్డారని తెలిపారు. దీంతో కూటమి ప్రభుత్వం స్థాపించడంలో జనసేన పాత్ర కీలకమైందని చెప్పారు. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. పార్టీ సిద్దాంతాలు, పవన్ ఆశయాలు ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్తామన్నారు. అలాగే పార్టీ బలోపేతానికి ప్లీనరీలో సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. మార్చి 12వ తేదీ ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవం ఉంటుందని, 14న బహిరంగ సభ జరుగుతుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News