Wednesday, January 8, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: అప్పుడే ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టాలి: వైఎస్ షర్మిల

YS Sharmila: అప్పుడే ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టాలి: వైఎస్ షర్మిల

ఈనెల 8న ప్రధాని మోదీ(PM Modi) విశాఖ పర్యటన నేపథ్యంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేశాకే ప్రధాని మోదీ విశాఖలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆమె ట్వీట్ చేశారు.

- Advertisement -

‘ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉంది. ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉంది. ఈనెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ గారిని, రాష్ట్రంలోని కూటమి పార్టీలను, APCC పక్షాన డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్రం తక్షణమే క్లారిటీ ఇవ్వాలి. SAILలో విలీనం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెంటనే విడుదల చేయాలి. ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ కష్టాలను గట్టెక్కించేందుకు సుమారు రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి.

భవిష్యత్‌లో స్టీల్ ప్లాంట్‌కు ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా సొంత గనులను కేటాయించాలి. ప్లాంట్‌కున్న 7 మిలియన్ టన్నుల సామర్ధ్యం మేరకు పూర్తి స్థాయిలో స్టీల్ ఉత్పత్తి చేయాలి. 1400 రోజులుగా ఆందోళనలు చేస్తున్న కార్మికుల డిమాండ్లపై యాజమాన్యంతో స్పష్టత ఇప్పించాలి. కార్మిక సంఘాలు అడుగుతున్నట్లు 3 ఏళ్ల పాటు స్టీల్ ప్లాంట్‌కి ట్యాక్స్ హాలీడే ఇవ్వాలి. స్టీల్ ప్లాంట్ భవిష్యత్‌పై నిర్ణయం ప్రకటించాకే మోడీ గారు విశాఖలో అడుగుపెట్టాలి” అని షర్మిల డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News