Wednesday, January 8, 2025
HomeతెలంగాణKTR: బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆరే: కేటీఆర్

KTR: బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆరే: కేటీఆర్

సీఎం రేసులో తనతో పాటు కవిత(Kavitha) ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆరే(KCR) అని తేల్చిచెప్పారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)కి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

- Advertisement -

ఇక తనను ఎలాగైనా అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్టులు, కేసులకు బీఆర్ఎస్ నేతలు భయపడరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని.. వారి సూచనల మేరకు విచారణకు హాజరు అవుతానని స్పష్టం చేశారు. కాగా ఈనెల 6న విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News