Thursday, January 9, 2025
Homeచిత్ర ప్రభAllu Arjun: నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్.. బెయిల్‌ పూచీకత్తు పత్రాలు అందజేత

Allu Arjun: నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్.. బెయిల్‌ పూచీకత్తు పత్రాలు అందజేత

హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్‌ వచ్చిన సంగతి తెలిసిందే. రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే సాక్షులను ప్రభావితం చేయకుండా కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. ఇక రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని షరతు విధించింది.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ వ్యక్తిగతంగా పూచీకత్తు పత్రాలు సమర్పించేందుకు కోర్టుకు వచ్చారు. ఆయన వెంట మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. బెయిల్‌ పూచీకత్తు పత్రాలు న్యాయమూర్తికి అందజేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. బన్నీ రాక నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News