Wednesday, January 8, 2025
Homeహెల్త్Coffee vs Tea: కాఫీ-టీ ఈ రెండింటిలో ఏది మంచిది.. నిపుణుల సలహా ఇదే..!

Coffee vs Tea: కాఫీ-టీ ఈ రెండింటిలో ఏది మంచిది.. నిపుణుల సలహా ఇదే..!

ఉదయం లేస్తూనే టీ లేదా కాఫీ తాగనిదే.. చాలా మందికి రోజు మొదలు అవదు. ఇక ఏదైనా కారణంవల్ల కాఫీ లేదా టీ తాగలేక పోతే చాలా మందికి ఏదో కోల్పోయామన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం ఉదయం కాఫీ, లేదా టీ లు అతిగా తాగడం మంచిది కాదని చెపుతుంటారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. కాఫీ, టీ ఈ రెండిటిలో ఏది మంచిది.. నిపుణులు ఏమంటున్నారో ఈ కథనంలో మనం తెలుసుకుందాం.

- Advertisement -

చాలా మంది ఉదయం లేవగానే టీ, కాఫీ తాగుతుంటారు. మన దేశంలో దాదాపు ప్రతి ఇంటిలోనూ ఇవి భాగమైపోయాయి. అయితే వీటిలో ఏది మంచిది అనే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతారు. టీ మంచిదని టీ లవర్స్ అంటే… కాఫీనే మంచిది అని కాఫీ ప్రియులు వాదిస్తూ ఉంటారు. టీ సాధారణంగా మనం ఎండిపోయిన టీ ఆకులతో తయారు చేస్తాం. టీ ఆకులను నీటిలో మరిగించి.. పాలు కలుపుకోని తాగుతూ ఉంటారు. అయితే.. టీ ఆకులను ఎండ పెట్టి.. పొడి చేసిన తర్వాత వాడతాం. టీలో సహజంగానే కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయట. వాటిని పాలీఫెనాల్స్ అంటారు. వాటి కారణంగానే టీ కమ్మని వాసన వస్తుంది. ఇక కాఫీ విషయానికి వస్తే కాఫీ గింజలతో పౌడర్ చేసి దానితో తయారు చేస్తారు. కాఫీలోనూ సహజ కెమికల్స్ ఉంటాయి. కాఫీ గింజలను వేయించి పొడి చేసిన విధానాన్ని బట్టి ఆ కెమికల్స్ ఉంటాయట.

రోజూ టీ తాగడం వల్ల….కొలిస్ట్రాల్ ని తగ్గిస్తుందట. బీపీ సమస్య ఉండదు, మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుందని నిపుణులు చెపుతున్నారు. టీలో సహజంగా ఉంటే పాలిఫెనాల్స్ లో అమినో యాసిడ్స్ ఉంటాయి. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెమరీ లాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయని చెపుతున్నారు. ఇక కాఫీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. లివర్ సమస్యలు, బ్రెయిన్ సమస్యలు, టైప్ 2 డయాబెటిక్స్ లాంటివి రాకుండా కాపాడతాయి. రక్తంలో షుగర్ లెవల్స్ ని తగ్గించడంలో, బ్రెయిన్ సెల్స్ ప్రొటెక్ట్ చేయడంలో, ఒత్తిడి తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అంటే మాత్రం మితంగా తాగితే.. రెండూ ఆరోగ్యమే అంటున్నారు వైద్యులు. అయితే అతిగే తాగితే మాత్రం ప్రమాదం తప్పదని చెపుతున్నారు. కొందరు లేవగానే టీ లేదా కాఫీ తాగుతుంటారు.. అదికూడా ప్రమాదమంటున్నారు వైద్యులు. ఉదయం లేవగానే కాఫీ తాగడంవల్ల కడుపులో యాసిడ్ రిఫ్లక్స్‌ పెరుగుతుంది. అదేవిధంగా కార్టిసాల్ స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఆందోళన, భయం పెరుగుతాయి. అంతేగాక రోజూ ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. విశ్రాంతిని, ఏకాగ్రతను దెబ్బ తీస్తుందని చెపుతున్నారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం.. ఆధారంగా రాసినది. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించడం లేదు. ఫాలో అయ్యే ముందు నిపుణుల సలహా తీసుకోండి.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News