Friday, April 18, 2025
HomeతెలంగాణKTR: సీఎం రేవంత్ రెడ్డి రైతు రాబందుగా మిగిలిపోతారు: కేటీఆర్

KTR: సీఎం రేవంత్ రెడ్డి రైతు రాబందుగా మిగిలిపోతారు: కేటీఆర్

తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఓట్ల కోసం కాంగ్రెస్‌ తప్పుడు హామీలిచ్చిందని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్‌ రైతుబంధువుగా.. సీఎం రేవంత్‌రెడ్డి రాబందుగా చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. రైతు భరోసా కింద రైతులకు రూ.12,000 ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. ఇందుకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు, మండల, జిల్లా, రాష్ట్రా కేంద్రాల్లో నిరసన చేపడతామన్నారు.

- Advertisement -

రైతు భరోసా(Rythu Bharosa) కింద రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడేమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదంటున్నారని.. హైడ్రా, మూసీ పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటే పెట్టుబడులు పెట్టడానికి, అప్పులు ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తారు అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగానికి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News