సంక్రాంతి పండుగ మన రాష్ట్రాలలోనే కాదు దేశం అంతా అత్యంత ప్రసిద్ధమైన పండుగ. ఎక్కువగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో జరుపుకుంటారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు సాధారణంగా సెలవులు ప్రకటిస్తారు. ఏపీలోని స్కూల్స్ సంక్రాంతి సెలవులపై గత కొన్ని రోజులుగా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలు దృష్ట్యా సంక్రాంతి సెలవుల్లో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆఖరికి ఏపీ ప్రభుత్వం జనవరి నెల 10 వ తారీఖు అంటే శుక్రవారం నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఇస్తామని ప్రకటించింది. కానీ ఈ సెలవులు రాష్ట్రంలోని అన్ని స్కూల్లకి వర్తిస్తుందా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. రాష్ట్రంలోని అకడమిక్ క్యాలెండర్ ప్రకారంగా 10వ తారీఖు నుంచి 19 తారీఖు వరకూ ఇచ్చింది. 20వ తేదీన మరలా పాఠశాలలు ప్రారంభం అవుతాయి. కానీ రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం కేవలం ఐదు రోజులే సెలవులు ఇచ్చారు. అది ఈ నెల 11 నుంచి 15 తారీఖు వరకూ సెలవులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ స్కూల్లకు స్వల్ప వ్యత్యాసంతో రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. సాధారణంగా పాఠశాలలకు పండగ సెలవులు జనవరి 10 నుంచి జనవరి 19 వరకు ఇచ్చారు, క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలు కు మాత్రం జనవరి 11 నుంచి జనవరి 15 వరకు సెలవులను తగ్గించారు.
Sankranthi Holidays: విద్యార్థులకు బాడ్‌న్యూస్.. సంక్రాంతి సెలవులు ఐదు రోజులే..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES