ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్ర ఇంట్లో వాళ్ళు అందరూ భోజనం చేస్తుంటారు. అప్పుడు పారిజాతం కావాలని ఈ వంటలు అన్ని నువ్వు చేసినవేనా లేదంటే ఏ ఇంట్లో నుంచిైనా వచ్చాయా అని అడుగుతుంది. నేనే చేశాను అంటుంది సుమిత్ర. కొత్త రుచులు నోటికి తగులుతుంటుంటే ఎవరు చేస్తున్నవో అర్థం కావట్లేదు అంటుంది. ఇన్నాళ్ల నుంచి నా వంట తింటున్నారు తేడా తెలియదా అని సుమిత్ర అంటే కొన్నిటికి దగ్గర పోలికలు ఉంటాయి లేమ్మా అంటుంది పారిజాతం. దీప నువ్వు ఒకలాగే చేస్తారు అంటుంది. అప్పుడు జ్యోత్స్న సొంత కూతురు కదా అలానే ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. ఇంకా పారిజాతం మాట్లాడుతుంటే శివన్నారయణ ఆపేస్తాడు.
జోత్స్న కంపెనీలో చేసిన పని చెప్పబోతుంటే నువ్వు ఏమి చేసినా పర్లేదు మన కంపెనీ ఏ నెంబర్ వన్ గా ఉండాలి అంతే అంటాడు. కార్తిక్ ఆ టిఫిన్ బండి తోనే మన రేంజ్‌కి ఎదగాలని చూస్తున్నాడు ఆ పగటి కలలను మనం చేరుకోకుండా చేయాలి అంటాడు. మరోవైపు జోత్స్న కంపెనీలోని ఉద్యోగులను తీసేసిన దాని గురించి దీప కార్తిక్ మంచి పని కాదని మాట్లాడుకుంటారు. కార్తిక్‌ను మీ తాతయ్య గారితో గొడవ పడద్దు అని చెప్తుంది. అడిగే పద్దతి సరిగ్గా ఉంటే ఏ గొడవ ఉండదు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటుంది దీప. అక్కడ జోత్స్న కంపెనీ పనులు చేసుకుంటుంటే మధ్యలో పారిజాతం వచ్చి ఎలా ఉండే పిల్లన ఎలా పాడుచేశారో అంటూ వెటకారం చేస్తుంది. నీ కోసం పాలు తెచ్చాను తాగు అంటే నువ్వే తాగు అంటుంది జోత్స్న. కంపెనీలో ఏదో చేసాను అన్నావు ఏంటి అని అడిగితే నీకెందుకు అని అంటుంది. ఇద్దరూ మాట మాట అనుకుని లాస్ట్‌కి చేసిన వెధవ పని చెప్తుంది. ఆఫీస్‌లో ప్రాఫిట్స్ పెంచడానికి నీలాంటి వాళ్లని తీసేసాను అని చెప్తుంది. అంటే కంపెనీలో 5 ఏళ్లు దాటిన వాళ్లని తీసేసాను అని చెప్తుంది.
కొం ముంచేశావు. మీ తాత నిన్ను నాలుగు పీకుతాడు వెంటనే ఆ ఎంప్లొయీస్‌ని వెనక్కి తీసుకో అంటుంది. ఎంత చెప్పినా వినకుండా జోత్స్న రెచ్చిపోతుంది. ఉదయాన్నే కార్తిక్ శివన్నారాయణ ఇంటికి వెళ్లి పేరు పెట్టి పిలిచి బయట కేకలు వేస్తాడు. వీడు నా ఇంటికి వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటూ కోపంగా శివన్నారాయణ అంటాడు. ఎందుకు వచ్చావ్ అని ప్రశ్నిస్తాడు. అందరూ లోపలికి రమ్మని అడిగితే తాత పిలిస్తేనే వస్తా అంటాడు కార్తిక్, నాకు సారీ చెప్తేనే ఇంట్లోకి రానిస్తా అని శివన్నారాయణ అంటాడు. మిమ్మళ్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాను అంటే మీ కంపెనీలో తీసుకునే నిర్ణయాలు గురించి అడగడానికి వచ్చాను అంటాడు. కంపెనీ సీఈఓ ఉంది తనే నిర్ణయాలు తీసుకుంటుంది అంటాడు శివన్నారాయణ. నేను చెప్పే మాట వింటారా లేదా అని కార్తిక్ అడుగుతాడు. నవ్వు ఇచ్చే ఫిర్యాదులు వినే అవసరం నాకు లేదు అంటాడు. శివన్నారాయణ కార్తిక్‌ను రెచ్చగొడతాడు. అప్పుడు కార్తిక్‌కు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.