Thursday, January 9, 2025
Homeఆంధ్రప్రదేశ్అంధకార ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీ వెలుగులు నింపారు -పవన్ కళ్యాణ్

అంధకార ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీ వెలుగులు నింపారు -పవన్ కళ్యాణ్

అంధకార ఆంధ్రప్రదేశ్ కు మోదీ రాకతో వెలుగులు నిండాయని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమరి వరకు ప్రజలందరితో మమేకమై.. అందరినీ ఏకతాటిపై నడిపించిన వ్యక్తి ప్రధాని అని పేర్కొన్నారు. విశాఖ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దేశాన్ని ప్రపంచ దేశాల్లో మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధానికి తన తరఫున, ఐదు కోట్ల మంది ఆంధ్రుల తరఫున హృదయపూర్వక నమస్కారమని తెలిపారు.

- Advertisement -

ఇక విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి, రెవెన్యూ మంత్రిగా, ఆర్థికమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి.. టీడీపీ రథ సారథి అయి, నాలుగోసారి ముఖ్యమంత్రి అయి, తెలుగు ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రాజకీయ ఉద్ధండులు అయిన సీఎం చంద్రబాబుకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా సహచర మంత్రి నారా లోకేశ్ కు, ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, బీజేపీ నేతలకు పేరుపేరునా నమస్కారాలు తెలిపారు. ఇక కూటమి విజయానికి కారణమైన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇవాళ ప్రధాని మోదీ 7 లక్షల మందికి ఉపాధి కల్పించే రూ.2.10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారని వివరించారు. అవినీతితో కూరుకుపోయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విలవిల్లాడుతున్న తరుణంలో మీరు మా కోసం నిలబడ్డారని ప్రధాని మోదీని ఉద్దేశించి తెలిపారు. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులతో మాకు అండగా నిలుస్తున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. 24 గంటలు తాగునీరు, మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు వేయగలుగుతున్నామంటే అందుకు కారణం మోదీ గారు వెన్నుతట్టి మద్దతుగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు.

గత ఐదేళ్ల అవినీతి, అరాచక పాలనతో ఏపీ అంధకారంలో ఉండిపోయింది.. ఆంధ్రాకు ఇక ఎలాంటి అవకాశమే లేదు అనుకున్న సమయంలో.. ఇటువంటి స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అనుకునేలా చంద్రబాబు నాయకత్వంతో ప్రధాని మోదీ నిర్దేశకత్వంలో వారి సూచనలు, సలహాలతో మా మంత్రి వర్గం, కార్యకర్తలు అభివృద్ధిలో భాగమవుతామని పేర్కొన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై నమ్మకం పెట్టారని.. ఆ నమ్మకం ఫలితమే ఇవాళ రూ.2 లక్షల కోట్లకు పైగా పనులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేలా ప్రధాని మోదీకి ఆ లక్ష్మీనరసింహస్వామి దీర్ఘాయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నా అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News