Friday, January 10, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ కు అండగా ఉంటాం- ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ కు అండగా ఉంటాం- ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అండగా ఉంటామని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మొదట తెలుగులో ఉపన్యాసాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

అనంతరం విశాఖ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారికి ప్రమాణామం చేసి తన ప్రసంగాన్ని కొనసాగించారు. మీపై అభిమానాన్ని చూపించే అవకాశం నాకు ఇప్పుడు లభించిందని ప్రధాని మోదీ అన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ప్రసంగాన్ని విన్నాను. రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని.

విశాఖలో దక్షిణ రైల్వే జోన్‌కు పునాది వేశామన్న ప్రధాని.. దీంతో ప్రత్యేక రైల్వే జోన్‌తో ఏపీ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోందన్నారు. రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఇక పర్యాటక రంగంతో కొత్త అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. మరోవైపు మత్స్యాకారుల ఆదాయం పెరిగేలా చూస్తామని ఇప్పటికే వారికి కిసాన్ క్రిడెట్ కార్డులు కూడా అందజేసినట్లు ప్రధాని తెలిపారు. మత్స్యకారుల భద్రత కోసం చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇక గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ ఏపీకి కేంద్రం కాబోతోందని ప్రధాని మోదీ అన్నారు. దీని ద్వారా ఏపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. మొబైల్ తయారీ రంగంలో ఏపీలో గుర్తింపు తెచ్చుకుందని వెల్లడించారు. ఐటీ, టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కేంద్రం కానుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు. 2030లోగా 5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి లక్ష్యమని.. దేశంలో 2 గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లు వస్తుంటే.. దానిలో ఒకటి విశాఖకు కేటాయించామన్నారు. ఏపీలో ఇప్పటికే 7 వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయని.. అమృత్‌ భారత్‌ కింద ఏపీలోని 70కి పైగా రైల్వేస్టేషన్లు ఆధునికీకరణ చేపట్టినట్లు ప్రధాని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News