Friday, January 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Tirupathi: తిరుపతి క్యూ లైన్లలో బుధువారం ఏం జరిగింది?

Tirupathi: తిరుపతి క్యూ లైన్లలో బుధువారం ఏం జరిగింది?

జరిగిందిదే..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులకు పోలీసులు- టిటిడి అధికారుల మధ్య సమన్వయ లోపం శాపంగా మారింది. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన తోకిసలాటలో 6 మంది భక్తులు మృతి చెందగా 29 మంది గాయాల పాలై తిరుపతి రుయా, సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరులో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.

- Advertisement -

తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి సమాచారం అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున భక్తులు తరలించారు. తిరుపతిలో 8 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా లక్ష ఇరవై వేల టోకెన్లు జారీ చేయాలని టిటిడి నిర్ణయించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులు ఆయా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున చేరుకున్నారు.

తిరుపతిలో బైరాగి పట్టెడ పద్మావతి పార్కు సమీపం రామానాయుడు పాఠశాల వద్ద, జియో కోన లోని సత్యనారాయణపురం జడ్పీ హైస్కూలు, ఎంఆర్ పల్లి లోని జడ్పీ హైస్కూల్లో, శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ భక్తుల వసతి సముదాయం వద్ద,రామచంద్ర పుష్కరిణి, తిరుమల బాలాజీ నగర్ కేంద్రాల్లో 90 కౌంటర్ల ద్వారా భక్తులకు టికెట్లు కేటాయించే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే భక్తులు సంఖ్య పెత్త ఎత్తున తరలి రావడంతో వారిని ఎప్పటికప్పుడు క్యూ లైన్ లో వదలకుండా హోల్డింగ్ పాయింట్ వద్ద ఎక్కువ మందిని పోలీసులు నిలిపివేయడం ఒక్కసారిగా వదలడంతో దూకిస్తాడు జరిగింది. తిరుపతి బైరాగి పట్టెడ వద్ద కేవలం ఇద్దరు పోలీసులు మాత్రమే ఉంటూ భారీ ఎత్తున చేరుకున్న భక్తులను క్యూలైన్లలో మొదలు వేయడంతో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది.

తోపులాటలో తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన మల్లికగా పోలీసులు గుర్తించారు. 29 మంది క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రి, సిమ్స్ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. రుయా ఆసుపత్రిలో నలుగురు, సిమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు క్షతగాత్రులు మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. విష్ణు నివాసం వద్ద జరిగిన తకిసలాటలో ఒక మహిళ మృతి చెందారు. 9 కౌంటర్ల ద్వారా 1.20 లక్షల వైకుంఠ ద్వార టికెట్లు గురువారం ఉదయం 5 గంటల నుంచి ఇవ్వవలసి ఉండగా భక్తుల రద్దీ నీ దృష్టిలో ఉంచుకొని టీటీడీ బుధవారం రాత్రి 9 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పోలీసులు టీటీడీ వైఫల్యం కారణంగానే కనీస సౌకర్యాలు కల్పించకుండా కారణమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 11:30 గంటలకు మృతుల బంధువులను, క్షతగాత్రులను పరామర్శించేందుకు తిరుపతికి రానున్నారు. సహాయకు చర్యలు చేపట్టే మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో శ్యామలరావు, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, నగర కమిషనర్ మౌర్య తదితరు అధికారులు సహాయక చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News