Friday, January 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Tirupathi: తొక్కిసలాటలో 40 మందికి గాయాలు, ఆరుగురు మృతి: కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్

Tirupathi: తొక్కిసలాటలో 40 మందికి గాయాలు, ఆరుగురు మృతి: కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరు మంది మృతి చెందగా 40 మంది గాయపడినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. క్షతగాత్రులను పరామర్శించిన ఆయన రుయా ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

క్యూ లైన్లోకి ఒక్కసారిగా వచ్చేసినందుకే

బైరాగి పట్టెడ శ్రీ పద్మావతి పార్కు వద్ద జరిగిన వైకుంఠ ద్వార దర్శన టికెట్లను పొందేందుకు ఒకసారిగా భక్తులు క్యూ లైన్ లలోకి తోసుకొని రావడంతో తోకేసులాట జరిగినట్లు తెలిపారు. ఈ తొక్కిసలాటలో 40 మంది గాయపడినట్లు తెలిపారు. క్షతగాత్రులలో 28 మందిని రుయా ఆసుపత్రికి, 12 మందిని సిమ్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు వివరించారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 28 మందిలో నలుగురు మృతి చెందారని, సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 మందిలో ఇద్దరు మృతి చెందారని తెలిపారు. మృతిచెందిన ఆరుగురిలో ఐదు మంది మహిళలు ఉండగా ఒకరు మాత్రమే పురుషుడు ఉన్నారని తెలిపారు. మృతుల్లో ఇరువురిని మాత్రమే గుర్తించడం జరిగిందని,
మరో నలుగురిని చిరునామా తెలియాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మీడియాకు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News